జనసేన పార్టీలో ఆ నేతలందరూ ఏమయ్యారు?

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2019లోనే తొలిసారిగా పోటీ చేసింది.ఆ ఎన్నికల్లో తనకు ఎంతో నమ్మకం ఉన్న నేతలకే పవన్ టిక్కెట్లు కట్టబెట్టారు.

 Janasena Leaders Should Active In Politics To Win, Andhra Pradesh, Janasena Part-TeluguStop.com

పొత్తులో భాగంగా కొన్ని సీట్లను కమ్యూనిస్టులకు, మరికొన్ని సీట్లు బీఎస్పీకి కేటాయించినా 126 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయగలిగారు.అయితే రాజోలు మినహా జనసేన ఎక్కడా గెలవలేకపోయింది.

చివరకు అధినేత రెండు చోట్ల పోటీ చేసినా చుక్కెదురైంది.రాజకీయాల్లో గెలుపోటములు సహజం కాబట్టి జనసేన పార్టీ ఈ ఓటమిని తేలికగానే తీసుకుంది.

కానీ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థుల్లో ఇప్పుడు చాలా మంది పార్టీలో కనిపించడం లేదన్న టాక్ నడుస్తోంది.ఎందుకంటే జనసేన టిక్కెట్లు దక్కించుకున్న వారిలో విద్యావంతులు, రాజకీయ పరిణతి చెందిన వారు ఉన్నారు.

జనసేన తరఫున అప్పట్లో పోటీ చేసి ఓడిన వారిలో ఇప్పుడు పార్టీకి అండగా ఉన్నది కేవలం పది మంది లోపేనని ప్రచారం జరుగుతోంది.ఉభయ గోదావరి జిల్లాలలో మాత్రం నలుగురు నేతలు యాక్టివ్‌గా కనిపిస్తున్నారని.

విజయవాడలో పోతిన మహేష్. అనంతపురంలో ఓ ఇద్దరు నాయకులు మాత్రమే పార్టీ జెండా మోస్తున్నారని తెలుస్తోంది.

Telugu Andhra Pradesh, Ap, Janasena, Pawan Kalyan-Telugu Political News

మరి మిగిలిన వారి పరిస్థితేంటి అన్న విషయం ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.అసలు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయడానికి జనసేనకు అభ్యర్థులు ఉన్నారా అన్న విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.అయితే కొందరు ఎన్నికల్లో పోటీ చేసే ఆర్ధిక బలం లేక తప్పుకున్నారని.మరికొందరు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది.

అయితే ఏ రాజకీయ పార్టీకైనా ఒక్క ఓటమితో పోయేదేమీ ఉండదు.ఆ ఓటమిని స్ఫూర్తిగా తీసుకుని గెలుపు కోసం కృషి చేయాలి.

కాబట్టి జనసేన అభ్యర్థులు ఇప్పటివరకు జరిగిన విషయాన్ని మరిచిపోయిన పార్టీ విజయం కోసం పోరాడాలని పలువురు సూచిస్తున్నారు.ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండటంతో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొని అధినేత పవన్ కళ్యాణ్‌కు అండగా నిలవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube