'సీతారామం' నుండి మృణాళినీగా భూమిక చావ్లా ఫస్ట్ లుక్ విడుదల

యుద్ధ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ ‘సీతారామం’.దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు.

 Bhumika Chawla's First Look As Mrinalini From 'seetharam' Released , Seetharam-TeluguStop.com

ప్రతి పాత్ర వినూత్నంగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అఫ్రీన్‌ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు.

తాజాగా ఈ చిత్రం నుండి సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా పాత్రని మృణాళినిగా పరిచయం చేశారు.ఒక పాపని దగ్గరగా తీసుకొని బ్యూటీఫుల్ స్మైల్ తో ఫస్ట్ లుక్ లో ఆకట్టుకున్నారు భూమిక.

ఈ చిత్రంలో ఆమె బ్రిగేడియర్ విష్ణు శర్మకి భార్య పాత్రలో కనిపించనున్నారు.వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube