కేసీఆర్ కామెంట్స్‎తో తెరపైకి కొత్త వివాదాలు

కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగింది.మోటార్లు, పంపులు నీట మునిగాయి.

 New Issues Arising With Kcr Comments On Kaleshwaram Project Details, Cm Kcr, Kcr-TeluguStop.com

వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నీటి పారుదల శాఖ అధికారులు కానీ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.దీన్ని కప్పిపుచ్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు కేసీఆర్.

రోజుకో కట్టుకథ అల్లి ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమాలు చేస్తు్న్నారు.ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో కట్టుకథ చెబుతున్నారు.

గోదావరి వరదలు ముంచెత్తిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు డామేజీని దాచిపెట్టేందుకేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంగా చెప్పుకునే లక్ష 35 వేల కోట్ల భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నీటిలో మునిగింది.

ప్రాజెక్టు పంపులు, మోటార్లు వరదలో చిక్కుకున్నాయి.వందల కోట్లరూపాయలు నష్టం వాటిల్లింది.ఇంత పెద్ద ఫెయిల్యూర్ ను దాచి పెట్టేందుకు టీఆర్ఎస్ నాయకత్వం పొలిటికల్ డైవర్షన్ ఎజెండాను ఎంచుకుంది.

కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో కట్టుకథ అల్లుతోంది.

ఇటీవల సీఎం, మంత్రులు చేస్తున్న కామెంట్లన్నీ అందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు.కాళేశ్వరం మోటార్లు, పంపులన్నీ మునిగిపవడంపై జనంలో చర్చ జరిగితే ఇప్పటి వరకూ చెప్పిన గొప్పలన్నీ గోదార్లో కొట్టుకుపోతాయని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.

అందుకే ఈ విమర్శల నుంచి తప్పించుకునేందుకు టీఆర్ఎస్ కొత్త వివాదాలు తెరపైకి తెచ్చింది.

Telugu Cloud Burst, Cm Kcr, Godavari Floods, Kcr-Political

ఈనేపథ్యంలోనే గోదావరి పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగిదని, దీని వెనుక విదేశీ కుట్ర ఉందని దీనిపై తమకు సమాచారముందంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు కలకలం రేపాయి.ప్లాన్ ప్రకారమే కాళేశ్వరం మునకను తెరమరుగు చేసేందుకు కేసీఆర్ ఇలాంటి కమెంట్లు చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ పోలవరం వివాదం తెరమీదకు తెచ్చారు.

పోలవరంతోనే భద్రాచలం మునిగిందని , ఆప్రాజెక్ట్ డిజైన్ మార్చి మూడు మీటర్ల ఎత్తు పెంచడం వల్లే వరద ముంచెత్తిందని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.కేంద్రం జోక్యం చేసుకొని ఎత్తు తగ్గించాలని, ఏపీలో కలిపిన అయిదు గ్రామాలను తిరిగి ఇవ్వాలని కోరారు.

ఇదంతా డైవర్షన్ రాజకీయాలేనని విపక్షాలు అంటున్నాయి.

Telugu Cloud Burst, Cm Kcr, Godavari Floods, Kcr-Political

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం,కన్నెపల్లి పంపుహౌస్ లను గోదావరి వరదలు ముంచెత్తాయి.మొత్తం 29 మోటార్లు మునిగి పోయాయి.ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి.

దాదాపు ఎనిమిది వందల కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా.ఇంత జరిగినా అక్కడేమీ జరగనట్టు వ్యవహరిస్తో్ంది.

దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.మునిగిన మోటార్లు మళ్లీ పనిచేస్తాయా? లేదా పునరుద్దరణ ఎప్పటికల్లా జరుగుతుందనే వివరాలను గోప్యంగా ఉంచడంపై ప్రాజెక్టు ఉనికినే ప్రశార్థకం చేస్తున్నాయి.మరోవైపు దీన్ని కప్పిపుచ్చేందుకు ప్రజల్ని తప్పుదోపట్టించే ప్రకటనలు చేస్తోది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube