ఎన్నారై కి భారీ జాక్ పాట్..ఎంతో తెలిస్తే గుడ్లు తేలేస్తారు...!!!

చెప్పొచ్చేది అదృష్టం కాదు చెప్పకుండా వచ్చేది దురదృష్టం కాదు అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు.యూఏఈ లో భారత సంతతి వ్యక్తికి ఊహించని విధంగా అదృష్టం వరించింది.

 Huge Jackpot For Nri..if You Know More, Eggs Will Float, Jackpot , Eggs, Lottery-TeluguStop.com

సహజంగా అరబ్బు దేశాలలో లాటరీలు అంటే గుర్తొచ్చేది మన భారతీయులే ఎందుకంటే అక్కడ నిర్వహించే లాటరీ లక్కీ డ్రా లో మన భారతీయులు ఎవరో ఒకరు తప్పకుండా బహుమతులు గెలుస్తూనే ఉంటారు.కొందరు ఏళ్ళ తరబడి లాటరీలలో లక్కు పరీక్షించుకుంటే మరి కొందరికి మొదటి సారే భారీ జాక్ పాట్ పొందుతారు.

ఈ కోవకి చెందిన వాడే కేరళకు చెందిన అనీష్.

భారత్ లోని కేరళ రాష్ట్రానికి చెందిన అనీష్ కేరళలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

ఆర్ధికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని యూఏఈ లో ఉద్యోగం సంపాదించి అక్కడ అజ్మన్ లోని ఓ సంస్థలో ఉద్యోగంలో చేరాడు.తన సంపాదనలో కొంత ఇంటికి పంపుతూ ఎలాగోలా కాలం నెట్టుకొస్తున్నాడు.

ఈ క్రమంలోనే తోటి భారతీయులు అక్కడి లాటరీలలో టిక్కెట్లు కొనుగోలు చేయడంతో అనీష్ కూడా లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించాడు.దాంతో.

మాజూజ్ డ్రా లాటరీ లో టిక్కెట్టు కొనుగోలు చేసిన అనీష్ అందరిలా తనను అదృష్టం వరించదని భావించాడు.టిక్కెట్టు కొనుగోలు చేసిన అనీష్ దాని గురించి పట్టించుకోలేదు కూడా.ఈ క్రమంలోనే మాజూజ్ డ్రా తీసిన లక్కీ డ్రాలో ఊహించని విధంగా అనీష్ 10 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు అంటే భారత కరెన్సీలో దాని విలువ అక్షరాలా రూ.21 కోట్లు.ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్న అనీష్ ఉబ్బితబ్బిబ్బై పోయాడు.తన జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని ఊహించలేదని, ఈ డబ్బుతో తనకు ఉన్న అప్పులు తీర్చి తన కుటుంబాన్ని యూఏఈ తీసుకువస్తానని మంచి వ్యాపారం చేస్తానని చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube