శ్రీజ మూడో పెళ్లిపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి గురించి ఈ మధ్య కాలంలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.శ్రీజ, కళ్యాణ్ దేవ్ గత కొన్ని నెలలుగా విడిగా ఉండటంతో వీళ్లిద్దరూ విడిపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

 Heroine Sensational Comments About Sreeja Third Marriage Details Here Goes Viral-TeluguStop.com

మరోవైపు శ్రీజ మూడో పెళ్లి గురించి ప్రచారంలోకి వస్తున్న వార్తలు అభిమానులకు మరింత చిరాకు తెప్పిస్తున్నాయి.సీనియర్ నటి పూజిత శ్రీజ మూడో పెళ్లి గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

శ్రీజ చిరంజీవి పరువు తీస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.అంతర్జాతీయ స్థాయిలో చిరంజీవికి పేరు, గుర్తింపు ఉందని అంత మంచి పేరు, గుర్తింపును కలిగి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీజ మూడో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని ఆమె కామెంట్లు చేశారు.

మీడియాలో శ్రీజ మూడో పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరగడం నిజంగా మూడో మ్యారేజ్ చేసుకోవడం వేరు అని ఆమె చెప్పుకొచ్చారు.శ్రీజకు కుటుంబంలో ఎక్కువగా ఫ్రీడం ఇచ్చారని అందువల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఆమె పేర్కొన్నారు.

శ్రీజ ప్రవర్తన బాలేదని చిరంజీవి పరువు తీసే విధంగా శ్రీజ ప్రవర్తించడం సరికాదని ఆమె చెప్పుకొచ్చారు. సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ ను పెళ్లి చేసుకోవడంలో సమర్థించిన పూజిత శ్రీజ విషయంలో ఈ విధంగా కామెంట్లు చేయడంపై విమర్శలు వ్యకమవుతున్నాయి.

పూజిత ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా మాట్లాడటం సరికాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.

Telugu Chirenjeevi, Kalyan Dev, Poojitha, Sreeja, Tollywood-Movie

మరోవైపు మూడో పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంపై శ్రీజ స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.శ్రీజ కుటుంబం నుంచి ఎవరైనా ఈ విషయాల గురించి స్పందించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.చిరంజీవికి వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నా ఈ తరహా విషయాల ద్వారా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube