తిరుపతి రుయా ఆసుపత్రి దగ్గర ప్రైవేటు అంబులెన్స్ ల దందాను కట్టడి చేయాలి: కందారపు మురళి

ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ప్రైవేటు అంబులెన్సుల దందా రోజురోజుకు మితిమీరిపోతున్న దని వీటిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు.మంగళవారం నాటి ఉదయం 2 గంటల సమయంలో జేసవా అనే బాలుడు కిడ్నీ విఫలమవడంతో మరణించాడు… మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్సు వారిని వేడుకున్నా… అంబులెన్స్ దళారులు పట్టించుకోలేదని ఆరోపించారు.

 Private Ambulances Should Be Set Up Near Tirupati Rua Hospital Kandarapu Murali-TeluguStop.com

అంబులెన్స్ ల ధరలు తట్టుకోలేక స్కూటర్ పైనే రాజంపేట జిల్లా లోని చిట్వేలుకు 90 కిలోమీటర్ల మేర బాలున్ని తరలించారు.ఉచితంగా తరలిస్తామని ముందుకు వచ్చిన అంబులెన్స్ ను రానివ్వకుండా దాడికి పూనుకోవడంతో విధి లేక విషమ పరిస్థితిలో ఆ తండ్రి మరణించిన తన బిడ్డను స్కూటర్ పై 90 కిలోమీటర్లు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి సిఐటియు విజ్ఞప్తి చేస్తున్నదని కందారపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు….కందారపు మురళి సిఐటియు తిరుపతి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube