మహావీర్ జయంతి : జైన్ కమ్యూనిటీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుభాకాంక్షలు

ప్రపంచంలో ఏ మూలన ఉన్నా .ఎవరినైనా సరే భారతీయ సాంప్రదాయాలు ఆకర్షిస్తూనే వుంటాయి.

 Us President Joe Biden Greets Jain Community On Occasion Of Mahavir Jayanti, In-TeluguStop.com

అందుకే పాశ్చాత్యులు సైతం భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ముగ్ధులై పోతుంటారు.ఎంతోమంది విదేశీయులు మనదేశానికి వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారంటే అది మన సనాతన ధర్మం గొప్పదనం.

భారతీయులను ఎన్నో దేశాల ప్రజలు ప్రేమిస్తారు, గౌరవిస్తారు.ఎక్కడకు వెళ్లినా భారతీయులు మూలాలను మరిచిపోరు.

అదే మనదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతోంది.

ఇకపోతే.

భారతీయులకు అమెరికా రెండో ఇల్లుగా మారిపోయిన సంగతి తెలిసిందే.దశాబ్ధాల కిందటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం మనవారు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వలస వెళ్లారు.

ఇందులో భారత్‌లోని అన్ని రాష్ట్రాల వారూ వున్నారు.వీరంతా తమ తమ రంగాలలో రాణిస్తూ మాతృదేశానికి, ఆశ్రయం కల్పించిన అమెరికాకు గర్వకారణంగా నిలుస్తున్నారు.

మన జనాభా నానాటికీ విస్తరిస్తూ వుండటంతో భారతీయ పండుగలు, ఆచార వ్యవహారాలు అక్కడ కూడా వెలుగొందుతున్నాయి.మన పండుగలకు అమెరికాలోనూ సెలవు ప్రకటిస్తున్నారంటే అక్కడ భారతీయులు ఏ స్థాయిలో వున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో మహావీర్ జయంతిని పురస్కరించుకుని భారతీయులకు , ప్రపంచవ్యాప్తంగా వున్న జైన సమాజానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు.భగవాన్ మహావీర్ బోధించిన అహింస, సత్యం, కరుణ మార్గాన్ని అనుసరించాల్సిందిగా ఆయన ట్వీట్ చేశారు.

శాంతి, సంతోషం, అందరి విజయం కోసం ప్రయత్నించే రోజని జో బైడెన్ అన్నారు.

Telugu Indians, Joe Biden, Kundala, Lord Mahavira, Mahavir Jayanti, Primenarendr

ఇకపోతే.జైనమతంలో 24వ తీర్థంకరుడైన మహావీరుడి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.భగవాన్ మహావీర్ బోధనలను తాము ఎల్లప్పుడూ గుర్తుచేసుకునే వుంటామన్నారు.

శాంతి, కరుణ, సోదర భావానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

బీహార్‌లో వైశాలికి సమీపంలోని కుందల గ్రామంలో క్రీ.పూ.599లో క్షత్రియ కుటుంబానికి చెందిన సిద్దార్ధుడు, త్రిషలకు మహావీరుడు జన్మించాడు.ఆయనకు తల్లిదండ్రులు మహావీరుడని నామకరణం చేశారు.ఈయన యశోధరను వివాహమాడగా.వీరికి ఓ కుమార్తె జన్మించింది.తన 36వ ఏట వర్ధమానుడు సన్యాసాన్ని స్వీకరించాడు.12 ఏళ్లు పాటు కఠోర తపస్సు చేయగా, వైశాఖ మాసం పదమూడో రోజున జృంభిక గ్రామంలో జ్ఙానోదయం కలిగింది.అనంతరం ముప్పై ఏళ్ల పాటు తన సిద్ధాంతాలను బోధిస్తూ.72వ ఏట క్రీ.పూ.527లో పావాపురిలో దేహాన్ని త్వజించారు మహావీరుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube