ఇప్పటి వరకు ఎక్కువ స్క్రీన్లలో విడుదలైన టాప్ సినిమాలు ఇవే!

సాధారణంగా సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఆ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ల ను బట్టి, అదేవిధంగా ఆ సినిమా కు ఉన్న క్రేజ్ ని బట్టి ఆ సినిమాలను వందలు లేదా వేల థియేటర్లలో విడుదల చేస్తూ ఉంటారు.అయితే కొన్ని కొన్ని సినిమాలకు భారీగా డిమాండ్ నెల కొన్నప్పుడు అలా అటు వంటి సినిమాలను అత్యధికంగా థియేటర్లలో విడుదల చేస్తూ ఉంటారు.

 Movies That Have Been Released In The Highest Number Of Screens So Far, Radhe Sh-TeluguStop.com

ఇకపోతే తెలుగులో ఇప్పటివరకు అత్యధికంగా థియేటర్లలో విడుదలైన చిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.దేశ వ్యాప్తం తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రానే వచ్చేసింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఇకపోతే ఈ సినిమా పై విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను అత్యధికంగా థియేటర్లలో విడుదల చేశారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 10200 కు పైగా స్క్రీన్ లలో విడుదలైన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.ఇక ఈ సినిమా తరువాత రెండవ స్థానంలో బాహుబలి సినిమా దాదాపుగా 9000 స్క్రీన్ లలో విడుదల చేశారు.

ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా 7978 స్క్రీన్లలో విడుదల అయ్యి మూడవ స్థానంలో నిలిచింది.

Telugu Bhahubali, Jr Ntr, Mahrshi, Pawan, Prabhas, Radhe Shyam, Ram Charan, Vake

ఆ తర్వాత మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా 4632 స్క్రీన్లలో విడుదల అయ్యి నాలుగవ స్థానంలో నిలిచింది.ఆ తరువాత బాహుబలి 1 సినిమా 4000 పైగా స్క్రీన్ లలో విడుదల అయింది.అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా 3000 థియేటర్లలో విడుదల అయింది.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా 2800 స్క్రీన్ లలో విడుదల అయ్యింది.అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 2600 థియేటర్లలో విడుదల అయింది.

మహేష్ బాబు నటించిన స్పైడర్, భరత్ అనే నేను సినిమాలు 2400 స్క్రీన్లలో విడుదల అయ్యాయి.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా 2300 స్క్రీన్ లలో విడుదల అయింది.

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా 2714 థియేటర్లలో విడుదల కాగా, కాటమరాయుడు సినిమా రెండు వేల స్క్రీన్ లలో విడుదల అయింది.

Telugu Bhahubali, Jr Ntr, Mahrshi, Pawan, Prabhas, Radhe Shyam, Ram Charan, Vake

మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా 1900 థియేటర్లలో విడుదల అయింది.బీమ్లా నాయక్ సినిమా 1875 స్క్రీన్ లలో విడుదల కాగా, చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా 1850 థియేటర్లలో విడుదల అయ్యింది.అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా 1800 థియేటర్లలో విడుదల అయ్యింది.

రంగస్థలం సినిమా 1650 థియేటర్లలో విడుదల కాగా సరిలేరు నీకెవ్వరు సినిమా 1640 థియేటర్లలో విడుదల అయింది.ఇటీవల విడుదల అయిన ఖిలాడి సినిమా 1600 కేరళ లో విడుదల అయింది.

బాలకృష్ణ నటించిన అఖండ సినిమా 1550 థియేటర్లలో విడుదల కాగా, విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ 1500 థియేటర్లలో విడుదల అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube