మరో రెండు నెలల్లో ఫెడరల్ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పార్టీకి స్టేట్ ఎలక్షన్స్‌లో ఓటర్లు షాకిచ్చారు.ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న లిబరల్ పార్టీ దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.
శనివారం ఆలస్యంగా జరిగిన ఎన్నికల తర్వాత లిబరల్ పార్టీ నాయకుడు స్టీవెన్ మార్షల్ ఓడిపోయారు.దీంతో 1.8 మిలియన్ల జనాభా కలిగిన దక్షిణ ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ అధికారాన్ని అందుకున్నట్లయ్యింది.
పీటర్ మలినాస్కాస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ 47 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో 25 సీట్లను గెలిచినట్లుగా ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
పోస్టల్, ప్రీ పోలింగ్ బ్యాలెట్లను సోమవారం లెక్కించి, తర్వాత తుది ఫలితాలను వెల్లడించనున్నారు.
రాష్ట్ర, సమాఖ్య స్థాయిలో మోరిసన్‌కు చెందిన లిబరల్ పార్టీ ఇటీవల నెలల్లో కోవిడ్ 19ను కట్టడి చేయడంలో విఫలమైనట్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి.ఈ ఏడాది ఒపీనియన్ పోల్స్‌లోనే మోరిసన్ పార్టీకి డేంజర్ బెల్స్ వినిపించాయి.
గత వారం ప్రచురించిన న్యూస్పోల్ ప్రకారం.ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు ఆంథోనీ అల్బనీస్.
కోవిడ్ తర్వాత మోరిసన్‌ను కాదని ప్రధానమంత్రి పదవికి బెస్ట్ ఛాయిస్‌గా నిలిచారు.
మలినాస్కాస్ విజయం పట్ల లేబర్ పార్టీ జాతీయాధ్యక్షుడు వేర్ స్వాన్ మాట్లాడుతూ.
దీనిని బట్టి దేశ ప్రజలు లిబరల్ ప్రభుత్వ పాలన ఇక చాలన్నట్లుగా స్పష్టమైన సందేశం ఇచ్చారని అన్నారు.ఇది స్టీవెన్ మార్షల్ ప్రభుత్వాన్ని తిరస్కరించడమే కాదని, లిబరల్ బ్రాండ్‌ని తిరస్కరించడంగా వేర్ స్వాన్ అభివర్ణించారు.
అయితే దక్షిణ ఆస్ట్రేలియా ఎన్నికల్లో ఫెడరల్ స్థాయి నాయకులు కీలకపాత్ర పోషించలేదు.అల్బనీస్ పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనగా… ప్రధాని మోరిసన్ మాత్రం ప్రచారంలోకి దిగలేదు.