ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను 2008లో ప్రారంభించినప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగింది.ఇటీవలే మరణించిన దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆ జట్టును కెప్టెన్‌గా, కోచ్‌గా విభిన్న పాత్రలు పోషించాడు.
అంతేకాకుండా అన్ని జట్లకు షాక్ ఇస్తూ టైటిల్ ఎగరేసుకుపోయాడు.ఇలా తొలి సీజన్ లోనే కప్ ముద్దాడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం మరోసారి కప్ సాధించేందుకు ఎంతగానో నిరీక్షిస్తోంది.
కెప్టెన్ సంజూ శాంసన్ (రూ.14 కోట్లు), జోస్ బట్లర్ (రూ.10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.4 కోట్లు)లను మాత్రమే రాజస్థాన్ జట్టు రిటైన్ చేసుకుంది.మిగిలిన అందరినీ వేలంలో కొనుగోలు చేసింది.రూ.62 కోట్లతో మెగా వేలంలోకి ప్రవేశించింది.ఇతర జట్లతో పోటీ పడి భారత సీనియర్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ (రూ.6.50 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్ (రూ.5 కోట్లు)లను కొనుగోలు చేసింది.కర్ణాటక బ్యాటింగ్ సంచలనం దేవదత్ పడిక్కల్‌ను రూ.7.75 కోట్లకు తీసుకోగా, రియాన్ పరాగ్ రూ.3.80 కోట్ల ధరతో తిరిగి జట్టులోకి చేరాడు.పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అత్యధికంగా రూ.10 కోట్ల బిడ్‌ను పొందగా, షిమ్రాన్ హెట్‌మెయర్ (రూ.8.50 కోట్లు), ట్రెంట్ బౌల్ట్ (రూ.8 కోట్లు) వెచ్చించారు.ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ కౌల్టర్-నైల్‌ను అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు.ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రస్తుతం ఆ జట్టు సమతూకంగా ఉంది.
రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ ప్రస్తుతం దుర్భేద్యంగా ఉంది.ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ సంజూ శాంసన్‌లలో ఏ ఇద్దరు చెలరేగినా భారీ స్కోర్లు వస్తాయి.ఇక హెట్‌మెయిర్ కూడా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించగల సత్తా ఉన్నవాడే.దక్షిణాఫ్రికాకు చెందిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కూడా భారీషాట్లు ఆడగలడు.దేశీ ఆల్‌రౌండర్లు రియాన్ పరాగ్, కరణ్ నాయర్ కూడా బ్యాట్ ఝుళిపిస్తే ఆ జట్టుకు తిరుగుండదు.ఇక బౌలింగ్ విషయానికొస్తే ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, కౌల్టర్ నైల్, హెట్ మెయిర్ పేస్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ల వద్ద సమాధానం ఉండదు.
చాహల్, అశ్విన్, కుల్దీప్ లతో ఆ జట్టు స్పిన్ బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది.