కరోనా వైరస్ కారణంగా స్పీడ్ గా సినిమాలు చేసే హీరోలు సైతం ఇప్పుడు స్లో అయిపోయారు.తక్కువ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇలాంటి సమయంలో కూడా బాలీవుడ్ ఖిలాడి గా పేరు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ మాత్రం నిజంగా సినిమాలు చేయడంలో ఖిలాడి అని నిరూపిస్తున్నాడు.ఎంతో తెలివితో ఇయర్ షెడ్యూల్ మొత్తం ముందే ప్లాన్ చేసుకున్నాడు.55 ఏళ్ళ వయసు కు చేరువలో ఉన్న అక్షయ్ కుమార్ యువ హీరోలకు సైతం సాధ్యంకాని స్పీడ్ తో దూసుకుపోతున్నాడు.ఇప్పటికే 2021 సంవత్సరం లో హై స్పీడ్ చూపించిన అక్షయ్ కుమార్ ఇప్పుడు 2022 కూడా తగ్గేది లే అని అంటున్నాడు.
ఏడాది చివర్లో సూర్యవంశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ కుమార్ 100 కోట్లు సాధించి సత్తా చాటాడు.ఇక అత్తరంగి రే అనే ఒక సినిమా ఓటిటి లో వదిలి అక్కడ సక్సెస్ సాధించాడు.
ఇక ఇప్పుడు కామెడీ మూవీ బచ్చన్ పాండే అనే సినిమాతో ఈనెల 18వ తేదీన ఈ ఇయర్ లో భోని కొట్టేందుకు సిద్ధమయ్యాడు.తెలుగులో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాకు ఇది హిందీ రీమేక్ అన్న విషయం తెలిసిందే.
ఈ మూవీ గురించి అటు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మూవీకీ సంబంధించిన ప్రమోషన్ శరవేగంగా జరుగుతున్నాయ్.
ఈ క్రమంలోనే ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా తన సక్సెస్ ఫార్ములా ఏంటి అన్న విషయాన్ని రివీల్ చేశాడు అక్షయ్ కుమార్. ఏదైనా కలిసికట్టుగా పని చేస్తేనే సాధ్యమవుతుందని అంటూ చెబుతున్నాడు బాలీవుడ్ ఖిలాడి.లక్కు కొంత పర్సంటేజీ ఉంటుందని తన కెరీర్లో 14 నుంచి 16 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని చెబుతున్నాడు.అయినప్పటికీ తాను మాత్రం ఒకేలా థింక్ చేస్తాను అంటూ చెబుతున్నాడు అక్షయ్ కుమార్.
ఇక ఇయర్ ప్లానింగ్ మొత్తం ముందే చేసుకుంటాను.సినిమా సినిమాకి వేరియేషన్ విషయంలో స్టోరీ జానర్ విషయం చూసుకుంటూ ఇక కెరీర్ లో ముందుకు సాగుతూ ఉంటాను అంటూ తన సక్సెస్ సీక్రెట్ ఇటీవలే అక్షయ్ కుమార్ బయటపెట్టాడు.అంతేకాదు సినిమా ఎంత బాగా లేకపోయినప్పటికీ మినిమం గ్యారెంటీ సినిమాలుగా అక్షయ్ కుమార్ సినిమాలు ఆడుతున్నాయి.