ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి గా భగవంత మాన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
సరిగ్గా భగత్ సింగ్ పుట్టిన గ్రామమైన నవన్ షహర్ జిల్లాలో… ఖాట్కర్ కలాన్ లో భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన ఎన్నికలలో మనకు ఓటు వేయని ప్రజలపై కోపం ద్వేషం చూపించవద్దని క్యాలెండర్ కి తెలియజేశారు.
ఎవరినైనా గౌరవించాల్సిందే.మీ అందరికీ అలాగే ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని తెలిపారు.కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరికొంతమంది కీలక నాయకులు హాజరయ్యారు.పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో 117 స్థానాలలో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.
దాదాపు 92 స్థానాలను గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంది.జాతీయ పార్టీలు బిజెపి అదే విధంగా కాంగ్రెస్ పార్టీలను మట్టి కలిపించింది.