ప్రపంచంలోనే అత్యంత చవకైన ఏసీ ఇదే.. విశేషాలివే!

దేశంలోని చాలా ప్రాంతాలలో ఎయిర్ కండిషన్ డబ్బున్న వారు మాత్రమే ఉపయోగిస్తారనే నమ్మకం ఉంది.ఎందుకంటే ఇది ఖరీదైనది.

 This Is The Cheapest Ac In The World Special, Evapolar, German Engineers, Usb-TeluguStop.com

అత్యధిక విద్యుత్తును వినియోగమవుతుంది.ఈ కారణాల వల్ల తక్కువ ఆదాయం ఉన్నవారు ఏసీ కొనుగోలు చేయలేయలేమనుకుంటారు.

అయితే వీరు ఫ్యాన్లు, కూలర్‌లను వినియోగించినా కూడా వేడిని తట్టుకోలేకపోతుంటారు.అయితే కూలర్ లేదా ఫ్యాన్ ధరలో ఏసీ అందుబాటులో ఉండి.

దాని కరెంటు బిల్లు ఫ్యాన్ కంటే తక్కువగా వస్తే.ఏసీని అమర్చుకోవడానికి ఎవరూ వెనుకాడరు.

మీ జేబుపై ఎక్కువ ప్రభావం పడకుండా అత్యధిక చల్లదనాన్ని ఇచ్చే ఏసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సైన్స్ చాలా పురోగతి సాధించింది.

ఫలింగా ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇద్దరు జర్మన్ ఇంజనీర్లు చాలా ఒక చిన్న ఏసీని రూపొందించారు.

ఎవాపోలార్ అనే పేరు కలిగిన ఈ ఏపీ ప్రపంచంలోనే అత్యంత చౌకైనది, చిన్నదిగా గుర్తింపు పొందింది.మీరు దీన్ని మీతోపాటు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.ఇది చాలా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది.అయితే కూలింగ్ విషయంలో దేనికీ తక్కువ కాకుండా ఉంటుంది.

ఇది 14 చదరపు మీటర్ల గదిని చల్లబరుస్తుంది.ఇంతేకాకుండా ఇది గాలిని కూడా శుద్ధి చేస్తుంది.

అంటే ఈ ఏసీ స్వచ్ఛమైన, చల్లని గాలిని అందిస్తుంది.ఈ ఏసీని అమర్చడం కూడా చాలా సులభం.

ఈ ఎవాపోలార్ ఏసీని యూఎస్బీ కేబుల్ ద్వారా పీసీ లేదా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేయడం ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు.దీనికి ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం కూడా ఉంది.

గాలి దిశను మార్చడానికి ఈ ఏసీలో తిరిగే బ్లేడ్‌లను అమర్చారు.ఇది 8 గంటలపాటు నిరంతరం పని చేస్తుంది.

వివిధ రంగులలో అందుబాటులో ఉంటుంది.పలు నివేదికల ప్రకారం ఈ ఏసీ రూ.3000 నుండి 3700 ధరలో లభిస్తుంది.మీరు దీనిని సంబంధిత ఆన్‌లైన్ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube