టాలీవుడ్లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు.ఆయన చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.అప్పటినుండి ప్రతి సినిమా నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి.
త్వరలో ప్రభాస్రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మార్చి 11న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో జరుగుతున్నాయి.
ఆల్రెడీ ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.ఇక ఈ సినిమా కోసం సుదర్శన్ 35 MM థియేటర్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ 85 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ రేంజ్ లో భారీ కటౌట్ పెట్టింది లేదు.ప్రభాస్ రేంజ్ ఏంటన్నది తెలిసేలా ఈ కటౌట్ ఉండబోతుందని తెలుస్తుంది.ప్రభాస్, పూజా హెగ్దే కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేశారు.ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.
రాధేశ్యామ్ సినిమాపై ప్రభాస్ భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు.సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు.