పవన్‌ లేకపోవడంతో అజిత్‌ కు మంచి అవకాశం దక్కిందా?

గత వారం పది రోజులుగా జరుగుతున్న చర్చకు పులిస్టాప్ పడింది.పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయడం లేదంటూ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

 Valimai Movie Lucky Because Pawan Kalyan Bheemla Nayak Release Postpone , Valim-TeluguStop.com

టిక్కెట్ రేట్ల విషయమై ఇంకా ఒక స్పష్టత రాని కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.టిక్కెట్ల రేట్లపై జీవో విడుదల కాలేదు దాంతో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చారు అనే వార్తలు వచ్చాయి.

అనుకున్నట్లుగానే సినిమాని వాయిదా వేశారు.ఫిబ్రవరి 25 న విడుదల కావాల్సిన ఆ సినిమా వాయిదా పడటంతో ఆ తేదీన మూడు సినిమాలు రాబోతున్నాయి.

మొదటి మెగా హీరో నటించిన గని కాగా రెండవది శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు.ఈ రెండు సినిమాలకు కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి.

ఇదే సమయంలో తమిళంలో రూపొందిన ప్రతిష్టాత్మక సినిమా వాలిమై కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటించడం ద్వారా ఇక్కడ అంచనాలు మరింతగా పెరిగాయి.

తెలుగు లో కచ్చితంగా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకుంటుంది అనే నమ్మకం అంత వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ తప్పుకోవడంతో ఈ సినిమాకు మంచి హైప్ లభించినట్లు అయింది.ఇప్పటికే అజిత్ కు తెలుగులో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది కనుక ఈ సినిమాతో ఆయన మంచి వసూళ్లు దక్కించుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

బోనికపూర్ ఈ సినిమాను నిర్మించడం తో అంచనాలు ఇంకాస్త పెరిగాయి.తమిళంలో 100 కోట్లు ఈజీగా ఈ సినిమా దక్కించుకుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

తెలుగులో మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుంది అనేది చూడాలి.పవన్ తప్పుకోవడం ఈ సినిమాకు ఎంత వరకు కలిసి వస్తుంది అనేది కూడా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube