'ప్రాజెక్ట్ కే' కీలక అప్డేట్.. అక్కడ షూట్ చేయబోతున్న టీమ్..

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు డార్లింగ్ ప్రభాస్.ప్రసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఉంది.

 Prabhas Project K Movie Shoot Latest Update Details,prabhas, Nag Aswin, Deepika-TeluguStop.com

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించ బోతున్నారు.నాగ్ అశ్విన్ చేసింది రెండే సినిమాలు అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

రెండు సినిమాల తోనే ఏకంగా డార్లింగ్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు.సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.సినిమా తదుపరి షెడ్యూల్ కోసం ఫిబ్రవరి రెండవ వారంలో హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి 10 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ సుందరి దీపికా పదుకొనె నటిస్తుంది.

ఇంకా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ షెడ్యూల్ లో దీపికా పదుకొనే కూడా పాల్గొనబోతున్నట్టు టాక్.ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్.

ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో పాటు.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు.

వీటితో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా కమిట్ అయ్యాడు.

Prabhas Project K Movie Shoot Latest Update Details,Prabhas, Nag Aswin, Deepika Padukone, Project K , Amitha Bachhan, Project K Shooting, Pan World Movie, Salaar, Aadipurush, Sandeep Vanga, Spirit - Telugu Salaar, Aadipurush, Amitha Bachhan, Nag Aswin, Pan, Prabhas, Project, Sandeep Vanga, Spirit

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube