హిట్టు పడ్డది అయినా వెయిటింగ్ తప్పట్లేదా..!

డేగ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మిర్చీ లాంటి కుర్రాడు సినిమా తీసి క్రిష్ డైరక్షన్ లో వచ్చిన కంచె తో లైం లైట్ లోకి వచ్చింది అందాల భామ ప్రగ్యా జైశ్వాల్.యువ హీరోలకి జోడీగా నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు సీనియర్ హీరోలతో కూడా సై అనేస్తుంది.

 Pragya Jaiswal No Movies In Hand After Superhit Details, Heroine Pragya Jaiswal,-TeluguStop.com

రీసెంట్ గా బాలకృష్ణ తో అఖండ సినిమాలో నటించింది ప్రగ్యా జైశ్వాల్.ఆ సినిమాతో కెరియర్ లో బ్లాక్ బస్టర్ అందుకుంది అమ్మడు.

అయితే ఆ రేంజ్ హిట్ అందుకున్నా ప్రగ్యా జైశ్వాల్ కి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదని తెలుస్తుంది.

అఖండతో కెరియర్ లో జోష్ వస్తుందని భావించినా సరే ప్రగ్యా జైశ్వాల్ కి అంత గొప్ప ఆఫర్లు ఏమి రావట్లేదని తెలుస్తుంది.

హిట్టు పడ్డది అయినా సరే అమ్మడికి వెయిటింగ్ తప్పట్లేదని టాక్.ఒకటి రెండు సినిమాలు కేవలం డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నాయట.

అంతేకాదు ప్రగ్యా జైశ్వాల్ డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడుతున్నారని తెలుస్తుంది.మరి అఖండతో అమ్మడి ఫేట్ మారుతుందని అనుకుంటే ఎప్పటిలానే కెరియర్ చప్పగా ఉందని చెప్పుకుంటున్నారు.

 ఆఫర్ల కోసం గ్లామర్ షోకి రెడీ అంటూ హింట్ ఇస్తున్నా ప్రగ్యా కి మాత్రం సరైన ఛాన్స్ రావట్లేదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube