హిట్టు పడ్డది అయినా వెయిటింగ్ తప్పట్లేదా..!

డేగ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మిర్చీ లాంటి కుర్రాడు సినిమా తీసి క్రిష్ డైరక్షన్ లో వచ్చిన కంచె తో లైం లైట్ లోకి వచ్చింది అందాల భామ ప్రగ్యా జైశ్వాల్.

యువ హీరోలకి జోడీగా నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు సీనియర్ హీరోలతో కూడా సై అనేస్తుంది.

రీసెంట్ గా బాలకృష్ణ తో అఖండ సినిమాలో నటించింది ప్రగ్యా జైశ్వాల్.ఆ సినిమాతో కెరియర్ లో బ్లాక్ బస్టర్ అందుకుంది అమ్మడు.

అయితే ఆ రేంజ్ హిట్ అందుకున్నా ప్రగ్యా జైశ్వాల్ కి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదని తెలుస్తుంది.

అఖండతో కెరియర్ లో జోష్ వస్తుందని భావించినా సరే ప్రగ్యా జైశ్వాల్ కి అంత గొప్ప ఆఫర్లు ఏమి రావట్లేదని తెలుస్తుంది.

హిట్టు పడ్డది అయినా సరే అమ్మడికి వెయిటింగ్ తప్పట్లేదని టాక్.ఒకటి రెండు సినిమాలు కేవలం డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నాయట.

అంతేకాదు ప్రగ్యా జైశ్వాల్ డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడుతున్నారని తెలుస్తుంది.

మరి అఖండతో అమ్మడి ఫేట్ మారుతుందని అనుకుంటే ఎప్పటిలానే కెరియర్ చప్పగా ఉందని చెప్పుకుంటున్నారు.

 ఆఫర్ల కోసం గ్లామర్ షోకి రెడీ అంటూ హింట్ ఇస్తున్నా ప్రగ్యా కి మాత్రం సరైన ఛాన్స్ రావట్లేదని తెలుస్తుంది.

ఒక్క మల్టీప్లెక్స్ లో రూ.5 కోట్ల కలెక్షన్లు సాధించిన కల్కి.. ఈ రికార్డ్ మామూలు రికార్డ్ కాదుగా!