Bruce Lee: ఆ మూవీ రిలీజ్‌కు ముందే చనిపోయిన బ్రూస్‌లీ.. అతని డెత్ ఇప్పటికీ మిస్టరీనే…

బ్రూస్ లీ.( Bruce Lee ) ఈ పేరుకు స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు.

 Full Mystery About Bruce Lee-TeluguStop.com

మార్షల్ ఆర్ట్స్( Martial Arts ) నేర్చుకునే ప్రతి వ్యక్తి ఈ దిగ్గజ ఫైటర్ ని ఆరాధిస్తాడు.బ్రూస్ లీలో 10% మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ వచ్చినా జీవితానికి చాలు అనుకుంటారు.

బ్రూస్ లీ లాంటి మనుషులు కోటికి ఒకరు పుట్టడం కూడా అరుదేనని చెప్పవచ్చు.ఎక్కడో పుట్టి 50 ఏళ్ల క్రితం చనిపోయినా బ్రూస్ లీ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే అతని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

చైనీస్ అమెరికన్ యాక్టర్, మార్షల్ ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఫిల్మ్ మేకర్ “జీత్ కునే డో”( Jeet Kune Do ) అనే మార్షల్ ఆర్ట్ కూడా స్థాపించాడు.అత్యంత ప్రభావవంతమైన మార్షల్ ఆర్టిస్ట్‌ల లిస్టులో ముందు వరుసలో ఉండే బ్రూస్ లీ సినిమాలు చేసి బాగా పాపులర్ అయ్యాడు.

యునైటెడ్ స్టేట్స్, ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో అతని సినిమాలు కీలక పాత్ర పోషించాయి.

Telugu Brain Aneurysm, Bruce Lee, Enter Dragon, Jeet Kune Dom, Martialartist, Ma

బ్రూస్ లీ 1973, జులై 20న తన 32వ ఏటలోనే కన్నుమూశాడు.తన కెరీర్‌లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ఎంటర్ ది డ్రాగన్’( Enter The Dragon ) విడుదలకు కొద్ది రోజుల ముందే ఇతడు మరణించాడు.ఈ సినిమా హాంకాంగ్‌లో 1973 జులై 26న రిలీజ్ అయితే, అమెరికాలో 1973, ఆగస్టు 19న విడుదలయ్యింది.

అంటే రీసెంట్ గానే ఇది 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.మార్షల్ ఆర్ట్స్ మాస్టర్‌పీస్‌గా పిలుచుకునే ఈ మూవీ సక్సెస్ చూడకుండానే బ్రూస్ లీ మరణించడం చాలా బాధాకరమని చెప్పవచ్చు.

ఈ మార్షల్ ఆర్టిస్ట్ తలనొప్పి కోసం ఒక పెయిన్ కిల్లర్‌ తీసుకునేవాడు.ఆ పెయిన్‌ కిల్లర్( Pain Killer ) వల్ల ఓ అలెర్జీ రియాక్షన్ వచ్చి అతడు చనిపోయాయని అంటారు.

అతని మరణానికి అధికారిక కారణం ఇదే అని అంటారు.కానీ, అతని మరణం గురించి అనేక ఇతర సిద్ధాంతాలు ఉన్నాయి.

Telugu Brain Aneurysm, Bruce Lee, Enter Dragon, Jeet Kune Dom, Martialartist, Ma

ఒక సిద్ధాంతం ప్రకారం అతనికి విషం పెట్టారు.మరో సిద్ధాంతం ప్రకారం మెదడు అనూరిజం (Brain Aneurysm) తో మరణించాడు.1973లో బ్రూస్ లీ ఎంటర్ ది డ్రాగన్ సినిమాకి డబ్బింగ్ చెబుతుండగా అలసటగా, తలనొప్పిగా అనిపించడంతో ఈక్వేజిక్ అనే పెయిన్ కిల్లర్ తీసుకున్నాడు.ఆపై తల తిరగడం, వికారం అనిపించడం ప్రారంభించింది.

అతను కుప్పకూలిపోయాడు.వెంటనే ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు.

బ్రూస్ లీ పోస్టుమార్టం లో పెయిన్ కిల్లర్ వల్లే అతడు చనిపోయినట్లు తేలింది.బ్రూస్ లీ మరణం మార్షల్ ఆర్ట్స్ ప్రపంచానికి, సినిమాకి తీరని లోటు.

అతని చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆస్వాదిస్తూనే ఉన్నారు.అతను మార్షల్ ఆర్టిస్ట్‌లు, సినీ ఆర్టిస్ట్‌లకు ఒకే విధంగా ప్రేరణగా నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube