గంగూభాయ్‌ తెలుగు బిజినెస్‌.. ఆర్‌ఆర్ఆర్ తో లాగించే ప్రయత్నం!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన గంగు భాయ్ సినిమా భారీ ఎత్తున ఈనెల 25 తారీఖున విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున చిత్ర యూనిట్ సభ్యులు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

 Alia Bhatt Hindhi Movie Gangu Bhai In Telugu , Alia Bhatt, Bollywood Movie , Fli-TeluguStop.com

గంగుబాయి సినిమాను కేవలం హిందీలోనే కాకుండా సౌత్ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో కూడా విడుదల చేయడంతో ఇక్కడ కూడా విడుదల కాబోతున్నట్లుగా మరింత క్లారిటీ వచ్చినట్లు అయింది.

అయితే అలియా భట్‌ నటించిన ఏ సినిమా కూడా ఇప్పటి వరకు ఇక్కడ విడుదల కాలేదు.కనుక తెలుగు రాష్ట్రాల్లో గంగుభాయ్ ఏస్థాయిలో ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తిగా మారింది.

Telugu Alia Bhatt, Bollywood, Gangu Bhai-Movie

ఈ సమయంలో గంగుభాయ్ సినిమాను తెలుగు లో విడుదల చేయబోతుంది ఎవరు అనే చర్చ కూడా జరుగుతోంది.ఎంత బిజినెస్ ను గంగుభాయ్ తెలుగు లో బిజినెస్ చేసింది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది.విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం గంగుభాయ్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ఐదు కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.ఆలియా భట్ కు ఆర్ఆర్ఆర్‌ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.

కనుక కచ్చితంగా గంగుభాయ్ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.అందుకే ఆ భారీ మొత్తంలో పెట్టి కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు.సినిమాకు మినిమం గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా 5 కోట్ల వసూళ్లు పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి థియేటర్ల ద్వారా అయిదు కోట్లను గంగుభాయ్ రాబట్ట గలుగుతుందా అనేది చూడాలి.

టాలీవుడ్ లో ఇప్పటికే ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ఉపయోగపడుతుందేమో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube