ప్రతి ఏడాది జనవరి మాసంలో సంక్రాంతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ సందర్భంగా సూర్యుడు దక్షిణాయన కాలం వదిలి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశించడం వల్ల ఈ పండుగ రోజు సూర్యభగవానుడికి అంకితం చేయబడినది.
ఈ విధంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరి ఉదయమే నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను జరుపుకుంటారు.
కానీ కొంతమంది మాత్రం ఎలాంటి స్నానాలు చేయకుండా చేసిన పిండివంటలు తినడానికి ఇష్టపడుతుంటారు.అయితే సంక్రాంతి పండుగ రోజు స్నానం చేయకుండా ఉంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
పురాణాల ప్రకారం రవి సంక్రమణ రోజు స్నానం చేయని నరుడు ఏడు జన్మల దాకా రోగి అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.ఇలా మీరు 7 జన్మల పాటు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని అర్థం.
అదే కనుక పండుగ రోజు శుభ్రంగా స్నానం చేసి సూర్య దేవుడిని, శనిదేవుడిని అలాగే శివుని ప్రార్థించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.మకర సంక్రాంతి రోజు ఉదయమే నిద్రలేచి నువ్వుల పిండితో స్నానం చేసి అనంతరం నువ్వులను నీటిలో కలిపి సూర్యదేవునికి సమర్పించాలి.అదేవిధంగా నువ్వులను దానం చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.