టాలీవుడ్ డైలాగ్ రైటర్ బుర్ర సాయి మాధవ్ తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్ త్వరలో రాబోతుంది.ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది.
ఈ ప్రోమోలో సాయి మాధవ్ బుర్రా తన సినిమా ఎంట్రీ సినిమా కష్టాలు అవకాశాల గురించి మాట్లాడారు ఈ క్రమంలో ఏపీలో టికెట్ల రేట్ల గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగారు ఆర్కే.దానికి సమాధానంగా సినిమా టికెట్లా ,సులభ్ కాంప్లెక్స్ టికెట్లా అలా తగ్గిస్తే ఎలా అన్న విధంగా మాట్లాడారు.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సులభ్ కాంప్లెక్స్ టికెట్ల రేట్లతో ఏపీ టికెట్ల రేట్లని పోల్చడం షాకింగ్ గా ఉంది.
టాలీవుడ్ లో డైలాగ్ రైటర్ గా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న సాయి మాధవ్ బుర్ర ఆయన మొదట అందుకున్న పారితోషికం ఎంత.ఇప్పుడు ఆయన ఒక సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత లాంటి విషయాలు కూడా రివీల్చేశారు.బాహుబలి సినిమా ఆఫర్ ఎలా మిస్సైంది.ఆర్.ఆర్.ఆర్ లో ఎలా ఛాన్స్ వచ్చింది లాంటి విషయాలను ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రోమోనే ఇలా ఉంటే సాయి మాధవ్ బుర్ర ఎపిసోడ్ బాగానే ఉండేలా ఉంది.