మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉండగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.ఈ క్రమంలోనే గత లాక్ డౌన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఒక లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి గుండు పాత్రలో ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.అయితే ఈ లుక్ మెహర్ రమేష్ భోళా శంకర్ కోసమేనని కేవలం ట్రైలర్ లుక్ అనే విషయం తాజాగా బయటపడింది.
ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’కి రీమేక్ అన్న ఈ విషయం మనకు తెలుస్తుంది ఇందులో అజిత్ ఎంతో అద్భుతంగా నటించారు.ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో భాగంగా ఆలుమ డోలుమ అనే పాత్రలో నటించారు ఇందులో అజిత్ గుండు లుక్ లో కనిపించారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఇదే లుక్ లో కనిపించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఈ లుక్ చిరంజీవికి పెద్దగా మంచిగ కనిపించకపోవడంతో డైరెక్టర్ మెహర్ రమేష్ గుండు పాత్రలో కాకుండా గడ్డంలో కనిపించేటట్లు చేస్తే హైలెట్ గా ఉంటుందని భావించారు.అందుకే ఈ సినిమాలో చిరంజీవి గుండు పాత్రలో మనకు కనిపించడు.అయితే ఈ విషయం తెలిసిన పలువురు నెటిజన్లు డైరెక్టర్ మెహర్ రమేష్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.