జనసేన తెలుగుదేశం పార్టీ ల పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా పొత్తు ఉండాల్సిందే అనే విషయానికి జనసేన టీడీపీ వచ్చాయి.ప్రస్తుతం జనసేన బీజేపీ మధ్య పోరు కొనసాగుతోంది.రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి అంటూ బీజేపీ అగ్రనేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రకటించారు.
కానీ వాస్తవ పరిస్థితి లోకి వచ్చేసరికి బీజేపీతో కలిసి ముందుకు వెళ్లడం అంత వర్కౌట్ కాదు అనే అభిప్రాయం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండటంతో పాటు , టీడీపీ నుంచి వస్తున్న ఒత్తిడితో మెల్లి మెల్లిగా టీడీపీకి పవన్ దగ్గరవుతున్నారు.తమ రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా గెలుస్తాం అనే నమ్మకంతో ఉన్నారు.
విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, మళ్లీ వైసీపీకి మేలు జరుగుతుందనే అభిప్రాయం రెండు పార్టీల నాయకుల్లోనూ ఉన్నాయి.అందుకే పొత్తు పెట్టుకోవాలని ఫైనల్ గా రెండు పార్టీలు డిసైడ్ అయిపోయాయి.
ప్రస్తుతం సీట్ల పంపకం విషయంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం .జనసేన దాదాపు 40 కి సీట్లను ఆశిస్తుండగా, టీడీపీ మాత్రం 20 స్థానాలు పొత్తులో భాగంగా ఇచ్చేందుకు అంగీకరించిందట. జనసేన తూర్పు, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో స్థానాలు కోరుతుండగా, తెలుగుదేశం సైతం ఈ ప్రాంతాల్లో తమ పార్టీ బలంగా ఉందని, రాయలసీమలో ఇచ్చేందుకు సిద్ధం అంటూ జనసేన కు రాయబారం పంపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం సీట్ల దగ్గర ప్రతిష్టంభన ఏర్పడడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పొత్తు విషయమై బహిరంగంగా స్పందించాలని రెండు పార్టీలు డిసైడ్ అయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.అలాగే జనసేన 6 ఎంపీ స్థానాలు కోరుతుండగా, మూడు ఇచ్చేందుకు టీడీపీ ఒకే చెప్పినట్టు సమాచారం.అయితే టీడీపీతో కలిసి నడిచేందుకు బీజేపి ఇష్టపడకపోవడం , ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపి ఎంపీ లతో నిర్వహించిన సమావేశంలో క్లారిటీ ఇవ్వడంతో బీజేపీపై టీడీపీ పూర్తిగా ఆశలు వదులుకుంది.
జనసేన తో పోత్తే అధికారంలో కూర్చోబెట్టగలదు అని టీడీపీ బలంగా నమ్ముతోంది.