భాగస్వామి వీసాల కోసం నిరీక్షణ : ఇమ్మిగ్రేషన్ ప్రాసెసింగ్‌లో జాప్యం.. ఇండో కెనడీయన్ల ఆవేదన

కరోనా మహమ్మారి కారణంగా అనేక దేశాలు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశాయి.ఇది ఎన్నో దేశాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు వెళ్లిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

 Immigration Processing Delays Leave Many Canadian Punjabis In Limbo, Immigration-TeluguStop.com

వ్యాక్సిన్, పాస్‌పోర్ట్, వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ ఇలా కొత్తగా వచ్చిన రకరకాల మార్గదర్శకాలు అంతర్జాతీయ ప్రయాణీకులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి.ఎప్పటికప్పుడు వీటిని ఎత్తివేయాలని ఆయా దేశాలు భావిస్తున్నా.

సరికొత్త వేరియంట్ల రాకతో వెనక్కి తగ్గాల్సి వస్తోంది.

ఇకపోతే.

కొవిడ్ మహమ్మారి కారణంగా కెనడా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ దెబ్బతినడం ఇండో కెనడీయన్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.పర్మీందర్ కౌర్ అనే పంజాబీ మహిళ తన పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) దరఖాస్తు క్లియరింగ్ కోసం చూసి చూసి విసిగిపోయింది.గత మూడేళ్లుగా తాను తన కుటుంబాన్ని కలవలేకపోయానని.2019లో పీఆర్ కోసం దరఖాస్తు చేసినా అది ఇంకా ప్రాసెసింగ్‌లోనే వుందన్నారు.

ఇక దీపక్ తల్వార్ అనే వ్యక్తిది మరో కథ.భారత్‌లో అద్భుతంగా సాగుతున్న వ్యాపారాన్ని వదిలిపెట్టి, ఇంటిని విక్రయించి 2017లో కుటుంబంతో సహా కెనడాలోని సస్కటూన్‌కు వలస వచ్చాడు.ఈ క్రమంలో ఆయన ఫ్యామిలీ .పీఆర్ దరఖాస్తులను సమర్పించింది.గతేడాది జనవరి 29 నుంచి వీటిపై ఎలాంటి పురోగతి లేదు.ప్రభుత్వ తీరు తన కుటుంబాన్ని తీవ్ర అనిశ్చితిలో వుంచిందని దీపక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Canada, Backlog, Delaysleave, Indians, Indo Canadians, Limbo-Telugu NRI

ఈ పరిణామాల నేపథ్యంలో భారత సంతతికి చెందిన ఎంపీ జస్‌రాజ్ సింగ్ హలన్ కెనడా పార్లమెంట్‌లో ఈ విషయాన్ని లేవనెత్తారు కూడా.తాజాగా దీనిపై ఆయన ట్వీట్ చేశారు.దేశంలో ఇమ్మిగ్రేషన్ బ్యాక్‌లాగ్‌లు 1.8 మిలియన్లకు పైగా వున్నాయని.ఇవి కేవలం సంఖ్య కాదని, వేరుగా వున్న కుటుంబాలని జస్‌రాజ్ సింగ్ పేర్కొన్నారు.

తమ సమస్యపై చట్ట సభలో లేవనెత్తినందుకు గాను హాలన్‌ను అభినందిస్తూ ఆంచల్ అనే మహిళ ట్వీట్ చేశారు.

తాను జూలై 2020లో పీఆర్ కోసం దరఖాస్తు చేశానని.కానీ నేటి వరకు దానిపై రివ్యూ జరగలేదని ఆమె మండిపడ్డారు.కనీసం మెసేజ్‌లు, ట్వీట్లు, ఫోన్ కాల్స్‌‌కు కూడా స్పందించడం లేదని ఆంచల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Canada, Backlog, Delaysleave, Indians, Indo Canadians, Limbo-Telugu NRI

మరో వలసదారుడు కన్వల్జీత్ సింగ్ ట్వీట్ చేస్తూ.‘‘తన భార్య కెనడాలో ఒంటరిగా వుంటూ మానసికంగా కృంగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.తనలాంటి చాలామంది వలసదారులు వారి జీవిత భాగస్వాములను కలవడానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని.

అందువల్ల జీవిత భాగస్వామి వీసాలను పరిశీలించి బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయాలని కన్వల్జీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.మరో మహిళ రవ్ నీత్ కౌర్ ఇలా అన్నారు.తాను గత రెండున్నర సంవత్సరాలుగా జీవిత భాగస్వామి వీసా కోసం ఎదురుచూస్తున్నానని. మెడికల్, బయోమెట్రిక్స్ పూర్తయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదని ఆమె ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube