భర్త రూపంలో తన జీవితంలో చెడు అనేది వచ్చిందని ప్రముఖ నటి పూజిత అన్నారు.మా వాళ్లు కూడా వాళ్ల కొడుకు కన్నా అతన్ని బాగా చూసుకున్నారని, ఏమైందో తెలియదు కానీ అతను ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని ఆమె చెప్పారు.
ఆ తర్వాత అతను వేరొక అమ్మాయిని పెళ్లిచేసుకోవడం, వాళ్ల అమ్మానాన్న తన దగ్గరికి రావడం, పెళ్లి ఆపమని అడగడం జరిగాయని ఆమె తెలిపారు.అప్పుడు తాను డైవర్స్ పేపర్స్ తీసుకొచ్చి మీరేమైనా చేసుకోండి అని అంటే, వారు వాటిని చింపేసి తమ కూతురి పెళ్లిని ఆపే శక్తి నాకొక్క దానికే ఉందని అన్నట్టు ఆమె చెప్పారు.
తను తన కొడుకుతో అతనికి దూరంగా వచ్చేసి బతుకుతున్నాను నేనేం చేయలేను అని ఆమె అన్నట్టు పూజిత తెలిపారు.ఆ తర్వాత వాళ్లు తన కాళ్లు కూడా పట్టుకునేసరికి చేసేదేం లేక కంప్లైంట్ పేపర్స్‌పై సంతకం పెట్టానని ఆమె అన్నారు.
ఆడవాళ్లతో స్నేహం చేసుకోవడానికి, మాట్లాడడానికే దూరంగా ఉంటానన్న పూజిత, ఓ ముగ్గురు మహిళలకు మాత్రం తాను ఎందుకు శత్రువుగా మారానో మాత్రం తనకు తెలియట్లేదని ఆమె చెప్పుకొచ్చారు.7 ఏళ్లు గా తనను బయటికి రాకుండా తన భర్త ఉంట్లోనే ఉంచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అవన్నీ తన తండ్రికి తలదించుకునేటట్టు చేయనని మాట ఇచ్చాను కాబట్టే భరించానని ఆమె అన్నారు.ఆ తర్వాత వాళ్లకు తెలిసినా కూడా వాళ్లను రావొద్దని కరాఖండిగా చెప్పేశానని ఆమె చెప్పారు.
తనకు సినిమాల్లో అవకాశాలు రాకుండా కూడా తన భర్త చేశాడని, చంపేద్దామని ఎత్తుకెళ్లిపోయారు కానీ తాను తప్పించుకొని వచ్చానని ఆమె అన్నారు.
ఇకపోతే తను అలాంటి పరిస్థితుల్లో ఉన్నపుడు మా అసోసియేషన్‌ని సంప్రదించినపుడు ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదని పూజిత అన్నారు.కనీసం తాను తెచ్చిన కంప్లైంట్ పేపర్లు కూడా వారు చూడలేదని ఆమె వాపోయారు.మురళీమోహన్ గారు మా’లో ఉన్నపుడు తనకు అంతా బాగుండేదని ఆ తర్వాత వచ్చినవాళ్లంతా తనను చాలా ఇబ్బంది పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.