పాపం నయనతార.. ఆ రోజు రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉన్న టాలీవుడ్ హీరో!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు.ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాలలో తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Tollywood Hero Craze For Nayanthara, Nayanthara,tollywood Hero, Nayanthara Birth-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ లేడి సూపర్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఏకంగా ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అలాగే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నారు.

హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార ఫ్యూచర్ లో ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ అనే పేరు సంపాదించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.ఈ విధంగా కెరియర్లో ఎంతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి ఒకరోజు రాత్రి మొత్తం నిద్రలేకుండా గడిపినట్లు తెలుస్తుంది.

గతంలో ఒకసారి నయనతార పుట్టినరోజు కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఒక టాలీవుడ్ హీరో ఆమె పుట్టినరోజు కోసం ఎంతో ఎదురు చూశారు.

Telugu Nayanthara, Tollywood-Movie

ఎలాగైనా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని నైట్ అంతా సీక్రెట్ మందు తాగుతూ పన్నెండు గంటల వరకు వేచి చూశారు.ఇక 12 తర్వాత ఎంతో ఉత్సాహంతో ఆమెకు ఫోన్ చేయాలని ప్రయత్నిస్తే చివరికి ఆమె ఫోన్ బిజీ బిజీ అని రావడంతో ఆ హీరో ఎంతో విసిగిపోయారు.సాధారణంగా నయనతార దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగడం వల్ల ఈమెకు ఎంతోమంది స్నేహితులు, సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు పరిచయం ఉండడంతో ప్రతి ఒక్కరు ఈమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేయాలని ఎంతో ఎదురు చూశారు.

Telugu Nayanthara, Tollywood-Movie

ఇలా ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తూ ఉండడంతో ఆ హీరో ఫోన్ చేయడం వల్ల నయనతార ఫోన్ బిజీ అని రావడం వల్ల చేసేదేమీ లేక అతను ఫోన్ లిఫ్ట్ చేసే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు.ఆ రోజు రాత్రంతా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయాలని ఎదురుచూసిన ఆ హీరోకి నయనతార ఫోన్ సుమారు రెండు గంటల తర్వాత కలవడంతో ఆమెకు ఫోన్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఆ హీరో అంతగా ఆమె కోసం ఎదురు చూసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి గల కారణం ఆమె పై ఉన్న అభిమానం అని చెప్పవచ్చు.ఇలా గతంలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి హీరో ఎంతో కష్టపడ్డారు ఈపాటికి ఆ హీరో ఎవరో మీకు అర్థమై ఉంటుంది.

ఇక ప్రస్తుతం నయనతార సినిమాల విషయానికి వస్తే ఈమె తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం నయనతార తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన గాడ్ ఫాదర్ అనే సినిమాలో చిరంజీవి చెల్లెలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube