ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు హై అలెర్ట్...ఈ రూల్స్ తెలుసుకోండి..

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచ దేశాలు అలెర్ట్ అవుతున్నాయి.ఇప్పుడిప్పుడే ప్రయాణ ఆంక్షలు తొలగిస్తూ వస్తున్నా దేశాలన్నీ మళ్ళీ ఆంక్షలు విధించే పనిలో పడ్డాయి.

 High Alert For Nris Coming Through Mumbai Learn These Rules  , Mumbai, Nri, Omec-TeluguStop.com

భారత ప్రభుత్వం కూడా గత అనుభవాల నేపథ్యంలో భారత్ వచ్చే వారిపై కొన్ని రోజుల క్రితమే ఆంక్షలు విధించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ముంబై సర్కార్ మాత్రం తమ రాష్ట్రంలోకి వచ్చే వారు ఎవరైనా సరే తప్పనిసరిగా తమ రాష్ట్ర నిబంధనలు కూడా పాటించి వెళ్లి తీరాల్సిందేనని తేల్చి చెప్తూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

ముంబై ఎందుకు ప్రత్యేకంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసిందంటే.ముంబై , ఢిల్లీ నుంచీ ఇంటర్నేషనల్ విమానాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.

ముంబై మీదుగా హైదరాబాద్ ,వైజాగ్, విజయవాడ చేరుకొని అక్కడి నుంచీ వారి వారి ప్రాంతాలకు వెళ్ళే వారు ఎక్కువగా ఉంటారు.కాబట్టి తమ రాష్ట్రంలో ఎలాంటి కరోనా కొత్త వేరియంట్ కేసులు రాకూడదంటూ అక్కడి సర్కార్ నిబంధనలు అమలు చేస్తోంది.

ఇప్పటికే ఈ నిబంధనలు అమలులోకి వచ్చేశాయి.

కేంద్ర నిబంధనల ప్రకారం విదేశాల నుంచీ భారత్ వచ్చే వారు అది కూడా  రిస్క్ దేశాల నుంచీ వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండాలని సూచించగా దానికి అదనంగా ముంబై సర్కార్ 7 రోజుల పాటు ఇనిస్టిట్యూషన్ క్వారంటైన్ ఉండాలని సూచించింది.

ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే RTPCR టెస్ట్ రెండో రోజు, అలాగే నాలుగు, ఏడవ రోజున కూడా టెస్ట్ లు చేయించుకోవాలని తెలిపింది.ఈ రిపోర్ట్ లలో నెగిటివ్ వస్తే ఇంటికి వెళ్లి హోమ్ క్వారంటైన్ లో ఉండేలా అనుమతులు ఇస్తారు,ఒక వేళ పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్సలు చేయిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube