బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్టార్ మా లో ప్రతి ఆదివారం ప్రసారమౌతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ ప్రెస్ హరి అషు రెడ్డి తమదైన శైలిలో వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే గత కొన్ని ఎపిసోడ్లు నుంచి వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడం, వీరి మధ్య ఎమోషనల్ సీన్స్ ఉండటంచేత ప్రేక్షకులు వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే హరి ఓ స్కిట్ లో భాగంగా అషు రెడ్డి పేరును తన గుండెల పై టాటూ వేయించుకుని ఇది పర్మినెంట్ టాటూ అని, ఇది చెరిపేస్తే చేరిగిపోయేది కాదంటూ తెలియజేయడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
అదే విధంగా తాజాగా అషు రెడ్డి కూడా ఎంతో విలువైన బైక్ ను హరికి గిఫ్ట్ గా ఇచ్చి దీని అవసరం నీకు ఎంత ఉందో నాకు తెలుసు అంటూ ఎమోషనల్ కాగ వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఇకపోతే వచ్చేవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా మరోసారి హరి టాటూ స్కిట్ వేశారు.అయితే ఈ ఎపిసోడ్ లో అషు రెడ్డి లేకుండా వేరే అమ్మాయితో ఈ స్కిట్ వేయడం జరిగింది.
ఈ స్కిట్ లో భాగంగా ఒక కాలేజీ అమ్మాయితో, “నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ప్రేమించాను తెలుసా?” అని చెప్పగా బయట అందరూ వేరే వాళ్ల పేరు వేసుకున్నావని చెబుతున్నారు.అని అడిగిందామె.“అవి జస్ట్ పేర్లు.తుడిపేస్తే ఇలా చెరిగిపోతాయ్” అని యాక్షన్ చేస్తూ చెప్పాడు హరి.
దీంతో జెడ్ శ్రీదేవి కలుగజేసుకుని ఏయ్.అషుతో ఐపోయారే హరి మీరు” అంది.
దాంతో ఖంగుతిన్నట్లు ఎగిరి కంత్రి లేసాడు ఆ తర్వాత వీల్ చైర్ లో వచ్చిన హరి నేను ఒక టాటూ వేసుకున్నందుకే నా పై అంత ప్రేమ చూపించారు ఇప్పుడు పది మంది అమ్మాయిలు తన రెండు చేతుల పై నా పేరును టాటూ వేయించుకున్నారని ఎమోషనల్ గా చెప్పాడు.
ఈ క్రమంలోనే ఆ అమ్మాయిలందరూ వారి చేతుల పై హరి అనే టాటూ వేయించుకోవడం చూపించగా అందుకు స్పందించిన శ్రీముఖి ఈ కటౌట్ కి అంతమంది ఏంటి రామా.అంటూ బిగ్గరగా నవ్వుతుంది.అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ రావాలంటే వచ్చే వారం వరకు వేచి చూడాలి.