సమాజంలో ప్రతీ ఒక్కరికి హక్కులుంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ క్రమంలోనే లైంగికత ఆధారంగా వివక్ష చూపరాదని న్యాయస్థానాలు సైతం గతంలో చాలా సార్లు తీర్పులనిచ్చాయి.
మగ, ఆడతో పాటు ఎల్జీబీటీ కమ్యూనిటీ వారికి హక్కులుంటాయని, వారికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని, అవి కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోర్టులు సూచించాయి.ఈ నేపథ్యంలోనే ఎల్జీబీటీ కమ్యూనిటీ వారు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇకపోతే స్వలింగ సంపర్కుల మ్యారేజ్‌కు సంబంధించిన ఇష్యూస్‌పై గతంలో చాలా గొడవలు జరిగాయి.ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించి ప్రజాభిప్రాయం సేకరించారు.
స్విట్జర్లాండ్ ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో స్వలింగ సంపర్కుల మ్యారేజ్‌కు మద్దతు తెలిపారు.మూడింట రెండు వంతుల మంది ప్రజలు సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో మ్యారేజ్, స్వలింగ సంపర్కులు చిల్డ్రన్స్‌ను అడాప్ట్ చేసుకునే హక్కుకు చట్టబద్దత కల్పించారు.స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన ఈ రెఫరెండంలో మెజారిటీ ప్రజలు ఓటింగ్‌తో గే మ్యారేజ్ చట్టబద్ధం అయింది.
దాంతో పశ్చిమ ఐరోపాలో స్వలింగ సంపర్కుల మ్యారేజ్‌ను చట్టబద్ధం చేసిన కంట్రీస్‌లో స్విట్జర్లాండ్ ఒకటిగా మారింది.స్విస్ దేశంలో డెమొక్రటిక్ వేలో నిర్వహించిన ఈ దేశవ్యాప్త అభిప్రాయ సేకరణలో 64.1 శాతం మంది ప్రజలు స్వలింగ సంపర్క మ్యారేజ్‌కు అనుకూలంగా తమ ఓటు వేశారు.
దాంతో దేశంలోని స్వలింగ సంపర్కులు ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు.స్విస్ క్యాపిటల్ బెర్న్‌తో పాటు దేశవ్యాప్తంగా గేల సంబురాలు అంబరాన్నంటాయి.ఈ క్రమంలోనే స్వలింగ సంపర్కుల మ్యారేజెస్ చట్టబద్ధత కోసం పోరాడిన ఆంటోనియా హౌస్ విర్త్ ఆనందం వ్యక్తం చేశారు.
చాలా రోజుల నుంచి ఈ విషయమై తాము పోరాడుతున్నామని, ఇప్పుడు సంతోషంగా ఉందని తెలిపారు.ఇలా గే మ్యారేజ్ చట్టబద్ధత కల్పించడం సమానత్వానికి ప్రతీక అని చాలా మంది అంటున్నారు.
ఈ కొత్త చట్టం, నిబంధనలు వచ్చే ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి.