పితృపక్షం అంటే మన పూర్వీకులకు పెద్దవారి కోసం 15 రోజుల పాటు పూజలు చేయడానికి పితృపక్షం అంటారు.ఈ పదిహేను రోజులలో ఏదో ఒకరోజు మనం చనిపోయిన మన వంశస్థులను, మన పూర్వీకులను స్మరించుకునే వారికోసం ఈ పితృ పక్షంలో పూజలు నిర్వహిస్తారు.
ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న కాలాన్ని పితృపక్షం అంటారు.మరి ఈ ఏడాది సెప్టెంబర్ 21 వ తేదీ నుంచి పితృపక్షం ప్రారంభం కానుంది.
ఎంతో పవిత్రమైన ఈ పితృపక్షంలో మన పెద్దలను స్మరించుకుంటాము కనుక 15 రోజులు ఎంతో నియమ నిష్టలను పాటించాల్సి ఉంటుంది.మరి ఈ పదిహేను రోజులు ఏ పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం…
ఈ పితృపక్షంలో మనం చనిపోయిన పెద్ద వారిని పూజించి వారికి శార్డం పెట్టడం వల్ల వారి ఆత్మ సంతోషించి మన పై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ విధమైనటువంటి పితృపక్షంలో మగవారు ఎలాంటి పరిస్థితులలోకూడా జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం వంటివి చేయకూడదు.ఎందుకంటే ఈ 15 రోజులను సంతాప దినాలుగా భావిస్తారు కనుక జుట్టు కత్తిరించుకోకూడదని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా పితృపక్షం ముగిసేవరకు కుటుంబంలో ఎవరూ కూడా కొత్త బట్టలను ధరించకూడదు.
ఈ పితృపక్షంలో కుటుంబంలో ఏ విధమైనటువంటి శుభకార్యాలను చేయకూడదు అలాగే కొత్త వాహనాలను, కొత్త ఇంటిని కొనుగోలు చేయకూడదు.అలాగే ఈ పదిహేను రోజులు పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోవడం ఎంతో ఉత్తమం.ఎవరు కూడా చికెన్ మటన్ ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
ఇంటిలో పూర్తిగా బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆ కుటుంబంపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయి.ఇలా ఈ పితృపక్ష కాలంలో ఒక రోజు మన పెద్దవారికి పూజలు చేసి శార్థం పెట్టడం వల్ల పితృ దోషాలు తొలగిపోయి వారి ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL