మాములుగా మ్యాచ్ లు జరిగేటప్పుడు ఆడియెన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తమ ఫేవరేట్ ఆటగాళ్లు మ్యాచ్ లు ఆడుతుంటే వారిని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ గోలగోల చేస్తూ ఉంటారు.
అభిమానాలు అంత ఎంజాయ్ చూస్తుంటేనే ఆటగాళ్లు మరింత ఉత్సాహంగా ఆడుతుంటారు.వారిని చుస్తే ఆటగాళ్లకు ఇంకా ఎనర్జీ వస్తుంది.
స్టేడియంలో ప్రేక్షకులు లేకపోతే అసలు ఆట కూడా ఆడాలని అనిపించదు.ఇప్పుడు కరోనా కారణంగా మ్యాచ్ లు ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.ప్రేక్షకులు లేక స్టేడియంలు వెలవెల బోతున్నాయి.ఎంత గెలిచినా ఆటగాళ్లు కూడా ఉత్సహంగా ఉండలేక పోతున్నారు.
ఎంతైనా ఆటగాళ్లకు సపోర్ట్ చేస్తూ వారిని ఎంకరేజ్ చేయడానికి ఆడియెన్స్ తప్పనిసరిగా కావాలి.
ఇక వీరు స్టేడియంలో చేసే గోల అంతా ఇంతా కాదు.ఒక్కోసారి కెమెరామెన్ లు ఆడియెన్స్ ను తమ కెమెరాలో బందిస్తూ ఉంటారు.అది చూసి ఆడియెన్స్ మరింత సందడి చేస్తారు.
తాజాగా ఒక మహిళ కూడా ఇలానే సందడి కెమెరామెన్ బిగ్ స్క్రీన్ మీద చూపించాడని ఆమె ఏం చేసిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్య పోతారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఈ ఘటన న్యూయార్క్ లో జరిగింది.మ్యాచ్ జరుగుతుండగా కెమెరామెన్ ఆమె వైపుకు తిప్పడంతో ఆమె స్క్రీన్ మీద చూసి ఇక గోల గోల చేసింది.ఆ ఆనందంలో చేతులు పైకెత్తి మరి తన చేతిలో ఉన్న బీర్ గ్లాసు మొత్తం అమాంతంగా తాగేసింది.ఈమె చేసే పని చుసిన మిగతా వారు కూడా బాగా ఎంజాయ్ చేసారు.
ఆమె బిగ్ స్క్రీన్ మీద కనిపించిందని ఆ ఆనందంలో ఏం చేయాలో అర్ధం కాక చేతిలో ఉన్న బీర్ గ్లాస్ ఆమ్ ఫట్ అనిపించింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.