స్టార్ హీరో అల్లు అర్జున్ టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ హీరోగా బన్నీ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి.
అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అర్హకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
రేపు వినాయక చవితి పండుగ కాగా అల్లు అర్హ బుజ్జి గణపయ్యను తయారు చేశారు.
అల్లు అర్హ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
చిట్టి చేతులతో అర్హ మట్టి బొమ్మలను అందంగా తయారు చేశారు.ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అల్లు అర్హ టాలెంట్ ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అర్హకు, అయాన్ కు మట్టి బొమ్మలు చేయడం ఎంతో ఇష్టం కాగా గతంలో కూడా వీళ్లు తయారు చేసిన మట్టిబొమ్మలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి.
అల్లు అర్హ భవిష్యత్తులో సినిమాల ద్వారా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే అర్హ సినిమాలపై ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది.శాకుంతలం సినిమా కోసం సమంత అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అల్లు అర్జున్ అభిమానులు సైతం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరోవైపు బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాలో మాత్రమే నటిస్తున్నారు.
ఈ సినిమాలోని పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ వేసుకునే మేకప్ కు ఏకంగా రెండు గంటల సమయం పడుతోందని తెలుస్తోంది.బన్నీ గతంలో ఏ పాత్ర కోసం పడనంత కష్టాన్ని పుష్పరాజ్ పాత్ర కోసం పడుతుండగా ఆ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.