పామాయిల్ ఎక్కువ‌గా వాడితే ఫ్యాటీ లివర్ వ‌స్తుందా..?

వంట‌ల‌కు ఉప‌యోగించే నూనెల్లో చాలా రకాలు ఉన్నాయి.వాటిలో పామాయిల్ ఒక‌టి.

 Does Excessive Use Of Palm Oil Cause Fatty Liver?! Palm Oil, Fatty Liver, Side E-TeluguStop.com

మిగిలిన వంట నూనెల‌తో పోలిస్తే పామాయిల్ ధ‌ర కాస్త త‌క్కువ‌గా ఉంటుంది.అందుకే చాలా మంది పామాయిల్‌నే వాడుతుంటారు.

ముఖ్యంగా భార‌తీయులు అత్య‌ధికంగా వాడే ఆయిల్ పామాయిలే.ఇళ్ల‌ల్లోనే కాదు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్స్‌లో, రెస్టారెంట్ల‌లోనూ పామాయిల్ ను యూజ్ చేసే వంట‌లు త‌యారు చేస్తుంటారు.

కానీ, పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాద‌ని, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రి లేటెందుకు పామాయిల్ వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లేంది.? అస‌లు పామాయిల్ వాడొచ్చా.? వాడ‌కూడ‌దా.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.పామ్ ఆయిల్ ని తాజా పామ్ పండ్ల నుంచి తీస్తారు.

మిగిలిన కుకింగ్ ఆయిల్స్‌తో పోలిస్తే ఈ పామాయిల్‌లో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.అందు వ‌ల్లే పామాయిల్ వాడితే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి.

ముఖ్యంగా పామాయిల్‌ను వాడే వారిలో ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.ఎందుకంటే, పామాయిల్‌ను అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ విప‌రీతంగా పెరుగుతుంది.దాంతో ఫ్యాటీ లివ‌ర్ బారిన ప‌డుతున్నారు.అలాగే పామాయిల్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, స్థూలకాయం, అతి ఆక‌లి వంటి వాటిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Telugu Fatty Liver, Tips, Palm Oil-Latest News - Telugu

అందుకే వీలైనంత వ‌ర‌కు పామాయిల్‌కు దూరంగా ఉండాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అప్పుడ‌ప్పుడు పామాయిల్ తీసుకుంటే హానికారకం ఏమీ కాక‌పోయినా.రెగ్యుల‌ర్‌గా మాత్రం తీసుకోరాద‌ని అంటున్నారు.ఇక‌ గుండె సంబంధిత జ‌బ్బులున్న వారు, లివ‌ర్ వ్యాధితుల‌తో బాధ ప‌డే వారు మ‌రియు అధిక బ‌రువు ఉన్న వారైతే అస్స‌లు పామాయిల్ జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే హెల్త్‌కి మేల‌ని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube