ముగించేసిన 'వరుడు కావలెను' షూట్ !

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.ఈయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

 Naga Shaurya Varudu Kaavalenu Movie Shoot Wrapped Up, Naga Shaurya, Varudu Kaava-TeluguStop.com

ప్రస్తుతం నాగ సౌర్య ‘వరుడు కావలెను’ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ లో నాగ సౌర్య తన లుక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా మహిళా డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇందులో నాగ సౌర్య కు జోడీగా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Lakshya, Naga Shaurya, Nagashaurya, Ritu Varma, Tollywood-Movie

కరోనా కారణంగా వాయిదా పడిన వరుడు కావలెను సినిమా ఈ మధ్యనే షూటింగ్ రీస్టార్ట్ చేసారు.గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ కంప్లీట్ చేసేసారు.ఈ నేపథ్యంలో నాగ శౌర్య, రీతూ వర్మ, డైరెక్టర్ లక్ష్మి సౌజన్య తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు మేకర్స్.ప్రేమ మరియు భావోద్వేగాలను మరింత నింపడానికి త్వరలోనే మీ ముందుకు వస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి వస్తున్న సాంగ్స్ కు మంచి స్పందన లభిస్తుంది.ఈ మధ్యనే ఈ సినిమా నుండి వచ్చిన దిగు దిగు దిగు నాగ సాంగ్ బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ వినగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ ఇందులో మురళీ శర్మ, నదియా కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Telugu Lakshya, Naga Shaurya, Nagashaurya, Ritu Varma, Tollywood-Movie

నాగ సౌర్య ఈ సినిమాతో పాటు లక్ష్య సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమాను సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపు కుంటుంది.దీంతోపాటు పోలీస్ వారి హెచ్చరిక సినిమా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కూడా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube