చిరు, నాగ్, బాలయ్య, వెంకీ నలుగురు ఆ సినిమాను రిజెక్ట్ చేశారట?

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే నలుగురు హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. ఇక ఈ హీరోలు కాదనకుండా ఎన్నో సినిమాలలో నటించగా.

 Four Star Heroes Rejected Evv Satyanarayana Movie Pill Nachindi , Nagarjuna, Bal-TeluguStop.com

ఇప్పటికీ టాలీవుడ్ లో యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు.ఇదిలా ఉంటే ఈ నలుగురికి ఒకే సినిమాలో అవకాశం రాగా ఆ సినిమాను రిజెక్ట్ చేశారట.

ఇక ఆ సినిమా ఏమిటో.అసలు ఎందుకు వదులుకున్నారు.

పైగా ఒకే సినిమాలో నలుగురు స్టార్ హీరోలు వదులుకోవడం అంటే ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని హాస్యకర సినిమాలకు కొంతమంది దర్శకులు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

అందులో మొదటి వరుసలో ఉన్న దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.ఈయన స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఇక ఈయన సినిమాలు ఎంత ఆసక్తిగా, సరదాగా ఉంటాయో ఆ సినిమాల టైటిల్స్ కూడా అంటే ఆకర్షణగా ఉంటాయి.ఇక ఈయన తన ఇద్దరి కొడుకులను ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయగా వారితో కూడా కొన్ని కామెడీ సినిమాలను చేయించాడు.

ఇదిలా ఉంటే ఈయన తన దర్శకత్వంలో 1999లో ‘పిల్ల నచ్చింది‘ అనే సినిమాను తెరకెక్కించాడు.

Telugu Allri Naresh, Aryan, Balakrishna, Chiranjeevi, Heroes, Srikantha, Nagarju

ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, రచన, సంఘవి నటీనటులు గా నటించారు.కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమాలో నటించిన నటులను కాకుండా వీరికంటే ముందు కొందరి నటులను కోరగా వాళ్లు కాదానడంతో వాళ్లను తీసుకున్నారు.

అంతేకాకుండా శ్రీకాంత్ కంటే ముందు దర్శకుడు సత్యనారాయణ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నటించమని అవకాశమివ్వగా ఈ సినిమాను రిజెక్ట్ చేశారట.

Telugu Allri Naresh, Aryan, Balakrishna, Chiranjeevi, Heroes, Srikantha, Nagarju

అలా పలువురు నటులు కాదనడంతో, వారికి కుదరకపోవడంతో వాళ్లను ఈ సినిమా కోసం మరో విధంగా పరిచయం చేశాడు.

సినిమా ప్రారంభమయ్యే ముందు నటీనటులను పరిచయం చేసే విధానంలో కాస్త చిరునవ్వులు పంచే విధంగా టైటిల్ కార్డ్స్ ను ఫన్నీగా చూపించాడు.ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ప్రేక్షకులను నవ్వులతో ముంచేసాడు దర్శకుడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube