24 కోట్లకి గని డిజిటల్, శాటిలైట్ రైట్స్...ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న లహరి

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.వరుణ్ తేజ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

 Ghani Movie Digital And Satellite Rights, Varun Tej, Kiran Korrapati, Super Star-TeluguStop.com

ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.స్పోర్ట్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అలాగే హిందీ నటుడు సునీల్ శెట్టి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు.నవీన్ చంద్ర కూడా నటిస్తున్నాడు.

ఇలా స్టార్ క్యాస్టింగ్ అందరూ గని మూవీలో కనిపించబోతూ ఉండటంతో సినిమాపై మంచి హైప్ ఉంది.అలాగే వరుణ్ తేజ్ రూపం కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండటం కచ్చితంగా ఈ మూవీని హై స్టాండర్డ్స్ లో దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నాడనే మాట వినిపిస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ ఈ మూవీలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తుంది.లాక్ డౌన్ అనంతరం మరల తాజాగా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర అప్డేట్ బయటకి వచ్చింది.ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని ఆహ చానల్ ఏకంగా 24 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.అలాగే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కోసం లహరి 1.5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది.ఇంత పెద్ద మొత్తంలో పాటల కోసం చెల్లించారంటే కచ్చితంగా సాంగ్స్ ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉండనే మాట వినిపిస్తుంది. అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ మరో ప్రొడ్యూసర్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube