వర్షాకాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో హెయిర్ డ్యామేజ్ ఒకటి.అధిక తేమ, పోషకాల లోపం, కేశ సంరక్షణ లేకపోవడం, వర్షాల్లో తరచూ తడవడటం, కాలుష్యం, కండిషనర్స్ ఉపయోగించకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది.
దాంతో జుట్టు ఎండినట్లు నిర్జీవంగా కల తప్పి కనిపిస్తుంది.అలాంటప్పుడు కొన్ని కొన్ని న్యాచురల్ రెమిడీస్ ప్రయత్నిస్తే.
సులభంగా హెయిర్ డ్యామేజ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.మరి ఆలస్యం చేయకుండా ఆ న్యాచురల్ టిప్స్ ఏంటో చూసేయండి.
ముందుగా బాగా పండిన ఒక అరటి పండును తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ అరటి పండు పేస్ట్‌లో కొద్దిగా పాలు పోసి కలుపుకుని.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు పై నుంచి చివర్లకు అప్లై చేసుకోవాలి.అర గంట అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేసి.తడి లేకుండా జుట్టును ఆరబెట్టుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు.
జుట్టుకు మంచి పోషన అంది డ్యామేజ్ అవ్వడం తగ్గు ముఖం పడుతుంది.
గుడ్డులోని పచ్చసొనతో కూడా హెయిర్ డ్యామేజ్‌ను నివారించుకోవచ్చు.ఒక బౌల్లో గుడ్డు పచ్చ సొన మరియు బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.
కాసేపటి తర్వాత మామూలు షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక గిన్నెలో రెండు స్పూన్ల అవకాడో పేస్ట్, రెండు స్పూన్ల పెరుగు, అర స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేశాలకు అప్లై చేసి.అర గంట పాటు వదిలేయాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది.