మా ఎన్నికల హడావుడి మొదలు అయ్యింది.సెప్టెంబర్ లో ఎన్నికలు జరుగాల్సి ఉంది.
కరోనా కారణంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయమై క్లారిటీ లేదు.అయినా కూడా ఎంతో మంది ఈ ఎన్నికల కోసం ముందస్తుగానే సిద్దం అవుతున్నారు.
ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ మరియు హేమ లు మా పీఠం కోసం ఎదురు చూస్తున్నారు.ప్రతి ఒక్కరు కూడా మా ప్రెసిడెంట్ గా మమ్ములను గెలిపిస్తే మా కు ప్రత్యేక భవనం నిర్మిస్తాను అంటూ హామీ ఇస్తున్నారు.
గడచిన పదేళ్లుగా మా కోసం సొంత భవనం కావాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు.మా కార్యవర్గం మాత్రం అందుకు సహకరించడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సమయంలోనే మంచు విష్ణ తన నామినేషన్ గురించి తెలియజేస్తూ తప్పకుండా తనను ఎన్నుకుంటే ఈసారి మా భవనం కట్టించి తీరుతాను అంటూ హామీ ఇస్తున్నాడు.
గతంలోనే మంచు విష్ణు మా కార్యవర్గం మెంబర్ గా పోటీ చేసిన సమయంలో మా భవనం నిర్మాణంకు ఎంత ఖర్చు అయినా కూడా అందులో 25 శాతం వరకు పెట్టుకుంటాము అంటూ హామీ ఇచ్చాడు.
ఈసారి కూడా ఆయన మళ్లీ అదే హామీని ఇస్తున్నాడు.
ఎన్ని కోట్లు అయినా కూడా అందులో 25 శాతంను ఖర్చు చేసేందుకు మంచు విష్ణు సిద్దం గా ఉన్నాడు కనుక ఇదే మంచి తరుణం అంటూ మా సభ్యులు కొత్త ఆలోచన చేస్తున్నారు.ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉందనే వార్తలు వస్తున్నాయి.కనుక మంచు విష్ణు గెలుపుపై అనుమానాలు ఉన్నాయి.
ఇలాంటి సమయంలో ఆయన నుండి 25 శాతం ప్రకటన రావడం తో ఖచ్చితం గా ఆయనకే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.