పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అద్భుత సంఘటన.చాలా మంది పెళ్లిని వేడుకగా, ఆనందంగా చేసుకుంటారు.
పెళ్లిని ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకోవడం ఆనవాయతీ.వారి వారి సంప్రదాయాల ప్రకారం పెళ్లిని జరిపించుకుంటారు.
పెళ్లిలో కూడా వారి సాంప్రదాయాల ప్రకారమే ఆ తంతు జరుగుతుంది.అయితే పేదవారు తమకు తోచిన విధంగా, డబ్బులుండేవారు ఎంతో ఆర్బాటంగా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.
సామాన్యులు పెళ్లిని తమకు కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి పందిరి వేసి జరుపుకుంటారు.
డబ్బున్న వాళ్లు పెద్ద పెద్ద హోటళ్లలో బిజినెస్ మెన్ల మధ్య, పలుకుబడి ఉన్నవారిని పిలిచి పెళ్లి తంతు జరిపించుకుంటారు.
డబ్బున్నవాళ్లు విందు కార్యక్రమాలు జరిపించుకోవడం చాలా ఖరీదుతో కూడుకున్న పని.కొత్తగా పెళ్లైనవారు ఎంతో ఖర్చు పెట్టి అనేక రకాల తినుబాండారాలు, ఫుడ్ ఐటెమ్స్, ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కొన్ని స్పైసీ ఫుడ్స్ ను ఏర్పాటు చేస్తారు.పెళ్లికి వచ్చిన బంధువులు, సన్నిహితులు నోటిని రుచికరమైన వంటకాలు తిని వెళ్లిన తర్వాత అధ్బుతమైన భోజనాలు పెట్టారని చెప్పడం మనం చూస్తూనే ఉంటాం.
ఆ పెళ్లిలో చివరగా తినే వధూవరులు చాలా ఆనందదాయకంగా ఒకరికొకరు తినిపించుకుంటారు.ఆ నవ వధూవరులు ఆ టైంలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.తాాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
నవ వధువు చేసే అల్లరికి నవ వరుడు ఫిదా అయిపోయాడు.నైట్రోజన్ స్మోక్ ఐస్‌క్రీమ్ ను వధువు తింటుంది.
ఆ సమయంలో చాలా సరదాగా ఆమె తినటం చూసి నవ వరుడు ఫిదా అయిపోతాడు.నవ వధువు నోట్లో నైట్రోజన్ స్మోక్ ఐస్ క్రీమ్ ను బేరర్ వేస్తాడు.
ఆ సమయంలో ఆమె నోట్లో నుంచి అలాగే ముక్కులో నుంచి పొగ ఒక్కసారిగా బయటకు వస్తుంది.ఆ ఐస్ క్రీమ్ నుంచి వచ్చే పొగను పెళ్లి కూతురు చాలా సరదాగా స్టైల్ గా వరుడిపైకి వదులుతుంది.
అలాగే పొగను బయటకు వదులుతూ తెగ సంబర పడిపోతుంది.కొత్త పెళ్లికొడుకు ఆమె చేస్తున్న తుంటరి పనిని చూసి ఆనందపడిపోతాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతొంది.
.