వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లుతో పాటు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ సినిమాలని చేస్తున్నాడు.ఈ రెండు షూటింగ్ దశలోనే ఉన్నాయి.
వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీని భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆగష్టు, సెప్టెంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.ఇక ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే, రష్మిక, సమంతా పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే వీరందరి కంటే ముందుగా మలయాళీ యంగ్ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ పేరు గట్టిగా వినిపించింది.ఆమెని హీరోయిన్ గా ఖరారు చేసేసారని ప్రచారం జరిగింది.
దాంతో ఈ అమ్మడు పేరు టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది. పవర్ స్టార్ అభిమానులు అయితే సోషల్ మీడియాలో ఆమె గురించి శోధించడం మొదలు పెట్టారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చింది.పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే కాని ప్రస్తుతానికి ఆయనకీ జోడీగా నటించడం లేదని స్పష్టం చేసింది.
ఈ విషయంపై తనని ఎవరూ సంప్రదించలేదని పేర్కొంది.భవిష్యత్తులో అవకాశం వస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో నటిస్తా అని చెప్పింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్, మలయాళీ బాషలలో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.మొత్తానికి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ మానసని ఎంపిక చేయలేదని ఆమె మాటలబట్టి తెలిసింది.
మరి కళ్యాణ్ బాబుకి జోడీగా ఎవరిని హరీష్ రంగంలోకి దించుతాడు అనేది చూడాలి.