నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ స్టార్ హీరోలలో ఒకరుగా ఉన్నారు.ఏకంగా 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న నాని మార్కెట్ వేల్యూ కూడా ఓ 30 కోట్ల వరకు ఉంది.
సినిమా సూపర్ హిట్ అయితే 50 కోట్ల మార్క్ ని కూడా ఈజీగా అందుకుంటున్నాడు.అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కెరియర్ స్టార్ట్ చేసిన నానికి అలా మొదలైంది, పిల్ల జమిందార్ సినిమాలు కెరియర్ పరంగా భాగా హెల్ప్ అయ్యాయి.
పిల్ల జమిందార్ సినిమా అయితే నాని కెరియర్ లో బెస్ట్ మూవీస్ లలో ఒకటిగా ఎప్పటికి నిలిచిపోతుంది.ఆ సినిమాలో ఫన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి.
అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాని డి.ఎస్.రావు నిర్మించారు.ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత డి.ఎస్.రావు ఓ యుట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నానిపై సంచలన వాఖ్యలు చేశారు.పిల్ల జమిందార్ సినిమా రెమ్యునరేషన్ తో పాటు అతను అడిగాడని ఓవర్సీస్ రైట్స్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చానని డి.ఎస్.రావు చెప్పుకొచ్చారు.
అయితే ఆ రైట్స్ ఇచ్చిన తర్వాత దాని ద్వారా ఎంత లాభం వచ్చిందనే విషయాన్ని కూడా నాని తనకు చెప్పలేదని అన్నారు.అలాగే రైట్స్ ఇచ్చినందుకు కనీసం థాంక్స్ కూడా నాని చెప్పలేదని, అతనికి కనీసం కృతజ్ఞత భావం లేదని సంచలన కామెంట్స్ చేశారు.తన దగ్గరకి వస్తున్నారని ఆరంభంలో చిన్న హీరోలతో సినిమాలు చేసి పెద్ద తప్పు చేశానని, అప్పుడే స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఉంటే తన రేంజ్ మరోలా ఉండేదని అన్నారు.
పెద్ద హీరోలతో సినిమాలు చేస్తే ఒక వేళ దెబ్బతిన్న మరో సినిమా చేయాలని అనుకుంటారని, చిన్న హీరోలు క్రింది స్థాయి నుంచి వస్తారు కాబట్టి ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత మరిచిపోతారని అన్నారు.హెల్ప్ చేయాలనే దృక్పథం వారిలో అస్సలు ఉందదని డి.ఎస్.రావు పేర్కొన్నారు.పిల్ల జమిందార్ హిట్ అయిన ఆ సినిమా విషయంలో నాని మీద నిర్మాత డి.ఎస్.రావు గుర్రుగా ఉన్నారని అయన మాటల బట్టి అర్ధమవుతుంది.దీనికి నాని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.