మీరే  ఆదుకోవాలి .. మాతో పొత్తు పెట్టుకోవాలి ?

తెలుగుదేశం పార్టీని ఎంత దూరం పెడుతున్న, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు మాత్రం బిజెపి పై అసలు ఏ మాత్రం మొహం విసుగుు రావడం లేదు.ఆ పార్టీ పొత్తు ఉంటేనే టిడిపి కి భవిష్యత్తు ఉంటుందనిి, లేకపోతే వైసీపీ ప్రభుత్వం వేధింపుల కారణంగా రాబోయే రోజుల్లో ఏపీలో టీడీపీ ఉనికి కోల్పోవాల్సి వస్తుందనే భయం చంద్రబాబును  వెంటాడుతోంది.

 Chandrababu Trying For Bjp Tdp Alliance In Andhra Pradesh , Alliance, Chandra Ba-TeluguStop.com

ఇప్పటికే అనేక మంది నాయకులు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ ఉండగా,యాక్టివ్ గాా ఉన్న  నాయకులపై కేసులు నమోదవుతున్నాయి.తాజాగా విశాఖ టిడిపి కీలక నాయకుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కు చెందిన భవనాన్ని నిబంధనల పేరుతో విశాఖ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు.

మొదటి నుంచి ఆయన వైసీపీలో చేరవలసిందిగా ఒత్తిడి వస్తున్నా, ఆయన టిడిపిలోనే యాక్టివ్ గా ఉండటం వంటి వ్యవహారాల కారణంగా ఇదంతా చోటు చేసుకుంది అనే భయం టీడీపీ శ్రేణుల్లో వచ్చేసింది.

ఇలా చెప్పుకుంటూ వెళితే, చాలా మంది నాయకులే దీని కారణంగా భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అందుకే వీలైనంత తొందరగా బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు తనకు ఉన్న పాత పరిచయాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారిని కలిసి పొత్తుకు ఒప్పించేందుకు ఎన్నో రకాలుగా చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారట.

త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారట.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో, అత్యవసర అపాయింట్మెంట్లు తప్ప, ప్రధానిని నేరుగా కలవడం ఎవరికీ సాధ్యం అవ్వడంలేదు.

Telugu Alliance, Ap, Chandrababu, Jagan, Janasena, Lokesh, Mlapalla, Pavan Kalya

ఈ వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత అయినా బిజెపి పెద్దలను కలవాలని బాబు చూస్తున్నారు.ఆ పార్టీ తో పొత్తు సెట్ అయితే, జనసేన మద్దతు ఎలాగూ ఉంటుందని, ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటే గతంలో కంటే భారీ స్థాయిలో సీట్లను త్యాగం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడు.ఈ మేరకు ఇప్పటికే బీజేపీ అధిష్టానం పెద్దలకు వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. కానీ టిడిపి విషయంలో బీజేపీ పెద్దలు కొంత సానుకూల వైఖరితో ఉన్నట్టుగా కనిపించడం లేదు.

అయినా బాబు మాత్రం పట్టు విడవకుండా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యులు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.బిజెపితో పొత్తు కనుక సెట్ అయితే, టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం మరింతగాా పెరుగుతుందని బాబు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube