వైరల్: సినిమా ఆఫర్ కోసం గొంతు కోసుకున్న యువకుడు..?!

ఆశ అనేది మనిషి బతికేలా చేస్తుంది.అదే ఆశ కొన్నిసార్లు కన్నుమూసేలా కూడా చేస్తుంది.

 Viral: The Young Man Who Cut His Throat For The Movie Offer ..?!  Viral News, Vi-TeluguStop.com

ఇప్పుడు మనం తెలుసుకునేది రెండో రకానికి చెందిన ఘటన.ఓ యువకుడికి ఉన్న సినిమా పిచ్చి నేడు ప్రాణం తీసుకునేలా చేసింది.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరులో చోటుచేసుకుంది.మారిముత్తు అనే యువకుడికి సినిమాలు అంటే చాలా ఇష్టం.ఆ పిచ్చితోనే అనేక ఈవెంట్లు చేసేవాడు.ఈ క్రమంలోనే సినిమాల్లో ఆఫర్లు రావాలంటే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని తన సోదరుడు చెబితే ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు.

జీవనం కోసం ఓ ప్రైవేట్‌ కంపెనీలో హెచ్ ఆర్‌ గా మారి ముత్తు పనిచేసుకుంటూనే సినిమా అవకాశాల కోసం ఎదురుచూడసాగాడు.ఈ క్రమంలోనే కాంచీపురం జిల్లాకు చెందిన మారిముత్తు కొన్నాళ్లుగా తిరువళ్లూరులో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు.

సినిమా అవకాశం రావాలంటే ఏదైనా కొత్తగా చేయాలనే పట్టుదలతో చనిపోకుండా గొంతు కోసుకుని రక్తం వస్తుండగా ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.అయితే ఈ క్రమంలో తన ప్రాణాలను కూడా లెక్కచేయడం మరిచిపోయాడు.

ఇంట్లో రక్తం వాసన రావడంతో కుటుంబీకులు అప్రమత్తమయ్యారు.

తలుపు కొట్టి చూడగా మారిముత్తు బయటకు రావడం లేదు.

ఆందోళన చెందిన కుటుంబీకులు తలుపులు బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో మారిముత్తు పడి ఉన్నాడు.అప్పటికే ఆ యువకుడైన మారిముత్తు చనిపోయి ఉండటం వల్ల రక్తం కొద్దిగా గడ్డకట్టి ఉంది.

వయసుకొచ్చిన కొడుకు చనిపోవడం చూసి కుటుంబీకులు రోదించడం అక్కడున్నవారిని కలచివేసింది.ఉద్యోగం చేసుకుంటూ సాఫీగా సాగుతున్న ఆ యువకుడి జీవితం సినిమా పిచ్చితో అర్దాంతరంగా ముగియడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.

యువకుడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube