ఆర్తి అగర్వాల్ చావుకు అతనే కారణం అంటూ నిర్మాత షాకింగ్ కామెంట్స్!

విక్టరీ వెంకటేష్ తో “నువ్వు నాకు నచ్చావ్” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆర్తి అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.తరువాత నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ప్రభాస్ అడవిరాముడు, ఇంద్ర వంటి చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Producer Chanti Addala Shocking Comments On Death Of Aarti Agarwal, Aarthi Aharw-TeluguStop.com

ఆర్తి అగర్వాల్ నటించిన అల్లరి రాముడు, అడవి రాముడు చిత్రాలకు నిర్మాతగా చంటి అడ్డాల వ్యవహరించారు.

అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆర్తీఅగర్వాల్ కేవలం తక్కువ కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే 2015 లో ఆర్తి అగర్వాల్ చేయించుకున్న సర్జరీ వికటించడంతో ఆమె మృత్యువాత పడ్డారు.ఆర్తి అగర్వాల్ ఇంత చిన్న వయసులోనే ఈ విధంగా మృతి చెందిన దానికి కారణం తన తండ్రి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత చంటి అడ్డాల.

Telugu Aari Agarwal, Aarthi Aharwal, Aarti Agarwal, Aartiagarwal, Chanti Addala,

ఆర్తి అగర్వాల్ విషయంలో తన తండ్రి సరిగ్గా వ్యవహరించి ఉంటే ప్రస్తుతం ఆర్తి అగర్వాల్ మన మధ్యనే ఉండేదని ఆర్తి అగర్వాల్ మరణం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.చంటి అడ్డాల నిర్మించిన రెండు సినిమాలలో ఆర్తి అగర్వాల్ నటించారు.ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే సమయంలో ఎప్పుడూ తన తల్లిదండ్రులు తన వెంట ఉండేవారని, వారు సెట్ లో ఉన్నప్పుడు తను ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యేదని, ఆర్తి అగర్వాల్ తన తల్లిదండ్రులు సినిమా సెట్ కి రాకపోతే తను ఎంతో ఫ్రీగా షూటింగ్ లో పాల్గొనేదని తెలిపారు.

ఆర్తి అగర్వాల్ పూర్తిగా తన తల్లిదండ్రుల పై ఆధార పడటం వల్ల ఏం చెప్తే అది చేసేదని, తన తండ్రి మాటలు విని ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ యూఎస్ కి వెళ్లి పెళ్లి చేసుకునే అంత లావుగా మారిపోయారు.

ఆ లావు తగ్గించుకోవడం కోసం సర్జరీ చేయించుకోవడంతో అధి కాస్త వికటించి మరణించిందని, ఆర్తి అగర్వాల్ చావుకు పూర్తిగా తన తండ్రి కారణం అంటూ నిర్మాత చంటి అడ్డాల పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube