ప్రియురాలు అడిగితే ప్రాణాలు సైతం త్యాగం చేసే ప్రేమికులు ఉంటారు.కొండమీది కోతినైనా తెచ్చివ్వగల లవర్స్ కూడా ఉన్నారు.
కొందరు తమ ప్రియురాలిని ఇంప్రెస్స్ చేసేందుకు ఎంతటి సాహసమైన చేస్తుంటారు.సాధారణంగా అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ లను వస్తువులు, పువ్వులు, చాకోలెట్స్ గిఫ్ట్ గా ఇవ్వమని కోరుతుంటారు.
కానీ ఒక అమ్మాయి అందరికీ భిన్నంగా చంద్రుడిని ముక్కలు ముక్కలు చేసి నేల మీదకు తీసుకురావాలని తన ప్రియుడిని అడిగింది.
అయితే ప్రియురాలు అడిగిందని ప్రియుడు వెంటనే చంద్రుడిని ముక్కలు ముక్కలు చేయడానికి సిద్ధపడ్డాడు.
నేల మీద నుంచే చంద్రుడికి అతిపెద్ద తాడు విసిరేసి దానిని గట్టిగా లాగుతూ బంధించాడు.అనంతరం తన మ్యాజిక్ కార్ లో ఎక్కి చంద్రుడి వద్దకు వెళ్లి దాన్ని తన మ్యాజిక్ స్టిక్ తో ముక్కలు ముక్కలుగా నరికి వేశాడు.
దీంతో చంద్రుడి ముక్కలు నేల మీద పడ్డాయి.ప్రియుడికి ప్రియురాలిపై ఎంత ప్రేముంటే మాత్రం చంద్రుడినే ముక్కలు చేయగలిగాడా అని అక్కడ ఉన్న వారంతా ముక్కున వేలేసుకున్నారు.
అయితే ఇదంతా జరిగింది ఒక సీరియల్ లో మాత్రమే.నిజంగా చంద్రుడిని ముక్కలు చేయడం ఏ మానవుడికి సాధ్యపడదు.కానీ సీరియల్స్ లో దేన్నైనా ముక్కలు చేయొచ్చు అని ఓ హిందీ డైరెక్టర్ చేసి చూపించాడు.
వివరంగా తెలుసుకుంటే.“హే జాదూ హై జిన్ కా” స్టార్ ప్లస్ ఛానల్ లో ప్రసారం అవుతోంది.అయితే తెలుగులో జిన్ మాయాజాలం పేరిట డబ్ కాబడిన ఇదే సీరియల్ స్టార్ మా ఛానల్ లో వస్తుంది.
అయితే ఈ సీరియల్ లో ప్రియురాలి కోసం ప్రియుడు చంద్రుడిని ముక్కలు చేసే సన్నివేశం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దీంతో నెటిజన్లు ఇటువంటి విడ్డూరమైన సన్నివేశం మీమేక్కడ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు.