జంతువుల‌కు కోవిడ్ టీకాను త‌యారు చేస్తున్న‌ దేశం.. !

ఏదైనా వ్యాది వస్తే మనుషులు నోటితో చెప్పుకుంటారు.అదే మూగజీవాలు మాత్రం ఎవరితో చెప్పుకుంటాయి.

 Russia Preparing Covid Vaccine For Animals Russia, Preparing, Covid Vaccine, An-TeluguStop.com

తగ్గితే బ్రతుకుతాయి.లేదంటే మరణిస్తాయి.

ఇక కరోనా వల్ల మనుషులతో పాటుగా ఎన్నో మూగ ప్రాణులు మరణించిన విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో మనుషుల కోసం కోవిడ్ టీకాను చేసిన దేశాలు జంతువుల కోసం మాత్రం ఏ వ్యాక్సిన్ కనుగొనలేకపోయాయి.

అయితే ప్రపంచంలోని ఒక దేశం అయిన రష్యామాత్రం జంతువుల‌కు ఇచ్చే కోవిడ్ టీకాను త‌యారు చేస్తున్న‌ది.ప్ర‌స్తుతం క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ దశలో ఈ వ్యాక్సిన్ ఉన్నట్లుగా రష్యా వెల్లడిస్తుంది.

అయితే ర‌ష్యాకు చెందిన వ్య‌వ‌సాయ సంబంధిత శాఖ రూజుల్ ‌కోజ్‌న‌డార్ ఈ టీకాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.జంతువుల‌కు ఇచ్చే కోవిడ్ టీకాకు కార్నివాక్‌-కోవ్ అనే పేరు కూడా పెట్టారని వెల్లడిస్తున్నారు.

ఇక ఈ టీకాలను కుక్కలు, పిల్లులు, న‌క్క‌లు, మింక్ జంతువుల‌కు ఇవ్వ‌వ‌చ్చు అని రష్యా పేర్కొన్న‌ది.కాగా ఈ వ్యాక్సిన్ల ఉత్ప‌త్తి ఏప్రిల్ నుంచి భారీ మొత్తంలో ప్రారంభం అవుతుంద‌ని ఇక్కడి అధికారులు వెల్లడిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube