మీ గ్లామర్ పెంచుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి చూపే విషయాలలో గ్లామర్ ( Glamour )కచ్చితంగా ఉంటుంది.బాడీ, పేస్ అట్రాక్టివ్ గా ఉండాలని యుక్త వయసులో కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.

 Want To Increase Your Glamour.. But Do This, Glamour, Lotions, Creams, Powders,-TeluguStop.com

అందుకోసం రకరకాల లోషన్లు, క్రీములు, పౌడర్లు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు.అయితే ఇవన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి అని దాదాపు అందరికీ తెలిసిందే.

అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో, చుట్టుపక్కల పరిసరాలలో లభించే ట్రెడిషనల్ మూలికలు( Traditional herbs ) వస్తువులతో కూడా గ్లామర్ పెంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Telugu Products, Black Eyes, Creams, Tips, Honey, Milk, Moringa, Powders-Telugu

ఇలాంటి వాటిలో మునగాకు ( Moringa )రసం, అలోవెరా జెల్ ఇంకా వివిధ సంప్రదాయ మూలికలు అద్భుతంగా పనిచేస్తాయని చెబుతున్నారు.ఫేస్ లో గ్లామర్ మరింత పెరగడానికి మునగాకు ఔషధంలా పనిచేస్తుంది.పిడికెడు ఆకుల్ని తీసుకొని మెత్తగా నూరడం ద్వారా వచ్చే రసాన్ని ప్రతిరోజు నిద్రపోయే ముందు ముఖానికి, మెడ భాగంలో అప్లై చేయాలి.

ఉదయాన్నే గోరువచ్చని నీటితో స్నానం చేయాలి.కొంతకాలం ఇలా చేస్తే ముఖంపై, మెడపై నలుపు చాయలు, మొటిమలు, ముడతలు తగ్గిపోతాయి.స్కిన్ లో యంగెస్ట్ షైనింగ్ కనిపిస్తుంది.చాలా మంది కళ్ళ కింద నలుపు( Black under eyes ) లేదా ముడతలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

Telugu Products, Black Eyes, Creams, Tips, Honey, Milk, Moringa, Powders-Telugu

ఇందుకు చక్కటి పరిష్కారం ఏమిటంటే ఒక చిన్న కప్పులో పాలను తీసుకొని అర స్పూన్ తేనె ( honey )కలిపి ముడతలు, నలుపు ఉన్న భాగాల్లో నిద్రకు ముందు అప్లై చేసుకోవాలి.ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.వారం రోజుల్లో సమస్య దూరం అవుతుంది.కొందరికి తరచుగా పెదాలు తడి ఆరిపోవడం, పగుళ్లు ఏర్పడడం ముఖంపై షైనింగ్ తగ్గడం జరుగుతూ ఉంటాయి.ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజు నిద్రపోయే ముందు అలోవెరా జెల్ ను పెదాలపై, ముఖంపై అప్లై చేసి రెండు గంటల తర్వాత చల్లటి నీటితో కడగాలి.దీంతో క్రమంగా పెదాలు సాధారణ స్థితికి వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube