తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న ఆమెకు ఇటీవల కాలికి గాయం కావడంతో పార్టీ కేడర్ ఒక్కసారిగా అప్రమత్తమైంది.
పోలీసులు లేని సమయంలో ఆమెకు గాయం కావడంతో .ఈ గాయం వెనకాల కుట్ర దాగి ఉంది అన్న అనుమానాలు ఆమెతో పాటు పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేయడం జరిగింది.
దీంతో రెండు రోజులపాటు ఆమె రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించిన తరుణంలో.దీదీ రెస్ట్ తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఆమె తన ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్టు అఫిడవిట్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.మొత్తం ఆస్తుల విలువ 16.72 లక్షలేనని.కనీసం కారు కూడా లేదని, ప్రస్తుతం చేతిలో అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఉండగా బ్యాంక్ బ్యాలెన్స్ 13.53 లక్షల రూపాయలు ఉన్నట్లు మమతా బెనర్జీ స్పష్టం చేసింది.