తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల కొత్త అడుగులు సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనం పేరుతో వైయస్ మద్దతుదారులతో ఆత్మీయులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు.
పార్టీ పెడితే ఎలా ఉంటుంది ? ఇంకా అనేక విషయాల గురించి అభిప్రాయాలు కూడా సేకరిస్తూ ఉన్నారు.మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విఫలమైన విషయాలపై భారీ డైలాగులు వేస్తూనే ఉన్నారు.
ఇలాంటి తరుణంలో ఇటీవల లోటస్ పాండ్ లో సన్నిహితులతో సమావేశం నిర్వహించిన క్రమంలో షర్మిల కీలక నిర్ణయాన్ని వెల్లడి చేశారు.
త్వరలో పార్టీ పేరు మరియు జెండా, అజెండా ప్రకటించకుండానే ముందుగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
గ్రామ మరియు మండల స్థాయి మరియు ఇతర కమిటీల నియామకం పై ఆలోచన చేస్తున్నట్లు షర్మిల అనుచరులతో మంతనాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.మండలానికి ముగ్గురు సభ్యులు చొప్పున కమిటీలు వేయాలని, ఈనెల 16వ తేదీలోగా కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఈ బాధ్యతను వైయస్ షర్మిలకు ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్న పిట్టా రాంరెడ్డికి అప్పగించారట.
అందుతున్న సమాచారం ప్రకారం మే 14 వ తారీకు పార్టీ ప్రకటన ఉండబోతున్నట్లు దానికంటే ముందుగానే పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం.